• Home »
  • Regulations »
  • టీవీన్యూస్ లో విదేశీ పెట్టుబడుల పెంపు?

టీవీన్యూస్ లో విదేశీ పెట్టుబడుల పెంపు?

అత్యంత కీలకమైన రైల్వే, రక్షణ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంచిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా న్యూస్ చానల్స్ లోనూ అదే కోణంలో ఆలోచిస్తోంది. రంగాల వారీగా విదేశీ ప్రత్యక్షపెట్టుబడులమీద ఇటీవలే శాఖాపరమైన సమీక్ష జరిపిన మంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయంలో సూత్రప్రాయంగా తన అభిప్రాయం వెల్లడించారంటూ హిందుస్తాన్ టైమ్స్ ఒక వార్తా కథనం ప్రచురించింది.

ప్రస్తుతం అంతర్ మంత్రిత్వశాఖ పరిశీలనలో ఉండగా తుది నిర్ణయం కోసం త్వరలో మంత్రికి చేరగానే నిర్ణయం వెలువడవచ్చునని భావిస్తున్నారు. కాబినెట్ లో ఆమోద ముద్ర పడగానే అధికారికంగా వెల్లడిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం టీవీ న్యూస్ చానల్స్ లో విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు 26 శాతానికి మించి ఉండకూడదు. దీన్ని 49 శాతం వరకు పెంచవచ్చునని రెండేళ్ళ కిందటే ట్రాయ్ సిఫార్సు చేసింది.

టెక్నాలజీలో వచ్చిన భారీ మార్పుల నేపథ్యంలో పరిమితులు అర్థరహితమని జైట్లీకొంతకాలంగా చెబుతూనే ఉన్నారు. విదేశీ మీడియా చొచ్చుకు వస్తున్న సమయంలో అందరికీ విదేశీ మీడియా వార్తలు అందుబాటులో ఉంటున్నప్పుడు ఇక్కడి సంస్థల్లో విదేశీ పెట్టుబడులమీద ఆంక్షలు పెట్టటం వలన ప్రయోజనమేమీ ఉండదని జైట్లీ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో న్యూస్ మీడియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద పరిమితి పెంచవచ్చునని భావిస్తున్నారు.

 

JAITLEY FDI