• Home »
  • Cable »
  • ఫీడ్ మీద ఆధారపడితే …. అంతే సంగతులు ! ఎమ్మెస్వోలను వెంటాడుతున్న లైసెన్స్ రద్దు భయం

ఫీడ్ మీద ఆధారపడితే …. అంతే సంగతులు ! ఎమ్మెస్వోలను వెంటాడుతున్న లైసెన్స్ రద్దు భయం

డిజిటైజేషన్ గడువు దగ్గరపడేకొద్దీ చిన్న ఎమ్మెస్వోల భయాలు పెరిగిపోతున్నాయి. అందుబాటులో ఉన్న పెద్ద ఎమ్మెస్వో నుంచి ఫీడ్ తీసుకుందామని మిన్నకుండిపోయిన వారిని ఇప్పుడు లైసెన్స్ పోతుందన్న భయం వెంటాడుతోంది. పెద్ద ఎమ్మెస్వో ఫీడ్ ఇస్తానని చెప్పినా, శాశ్వతంగా ఆ ఎమ్మెస్వో మీద ఆధారపడటమంటే అస్తిత్వం కోల్పోవటమేనన్న వాస్తవం చాలామందిని ఇబ్బంది పెడుతోంది.

పెద్ద ఎమ్మెస్వో ఎలాగూ డిజిటల్ హెడ్ ఎండ్ పెట్టుకుంటాడు కాబట్టి కొత్తగా మళ్ళీ తాము హెడ్ ఎండ్ పెట్టుకునే భారం లేకుండా అతడి నుంచి ఫీడ్ తెచ్చుకుందామని చాలామంది స్వతంత్ర ఎమ్మెస్వోలు భావిస్తూ వచ్చారు. ఫీడ్ తెచ్చుకోవటానికయ్యే బ్రాడ్ బాండ్ చార్జీలు సైతం కట్టుకోవటానికి సిద్ధమయ్యారు. కనీసం తాము ఎమ్మెస్వోలుగా మిగులుతామని అనుకున్నారు.

కానీ ట్రాయ్ నిబంధనలు మరోలా ఉన్నాయి. డిజిటల్ ఎమ్మెస్వోగా లైసెన్స్ తీసుకున్నంతమాత్రాన ఎమ్మెస్వో అయిపోరని, హెడ్ ఎండ్ పెట్టి తీరాలని, పైగా అది ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు తగినట్టుగా ఉండాలని, బెసిల్ ఆడిట్ కి సిద్ధంగా ఉండాలని ట్రాయ్ నిబంధనలు చెబుతున్నాయి. అంటే ఫీడ్ తీసుకోవటానికి పరిమితమయ్యే ఎమ్మెస్వో తనకు డిజిటల్ ఎమ్మెస్వోగా అనుమతి ఉన్నప్పటికీ ఆ అనుమతిని కోల్పోతాడు. తాను అనుమతి తీసుకున్న ప్రాంతంలో హెడ్ ఎండ్ పెట్టకపోతే లైసెన్స్ పోయినట్టే.

పైగా, పే చానల్ యజమానులతో ఎలాంటి సంబంధమూ ఉండదు. ఒప్పందాలు చేసుకునేది పెద్ద ఎమ్మెస్వో మాత్రమే కాబట్టి ఏ విధంగా చూసినా చిన్న ఎమ్మెస్వోలకు కష్టాలు తప్పేట్టు లేవు. కోట్లు వెచ్చించి డిజిటల్ హెడ్ ఎండ్ పెట్టటమా, లేదంటే పెద్ద ఎమ్మెస్వో పరిధిలోకి వెళ్ళిపోవటమా అనే అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోక తప్పేట్టు లేదు.

హిట్స్ ఒక్కటే మార్గం

ఇటువంటి చిత్రమైన పరిస్థితుల్లో హిందుజా వారి హిట్స్ ప్లాట్ ఫామ్ ’ నెక్స్ట్ డిజిటల్ ’ మాత్రమే సరైన పరిష్కారం చూపించగలుగుతోంది. ఎమ్మెస్వోకు వాళ్ళు ఇచ్చే సొల్యూషన్ ను సాంకేతికంగా హెడ్ ఎండ్ గానే పరిగణిస్తారు కాబట్టి లైసెన్స్ పొందిన  ప్రతి చిన్న ఎమ్మెస్వోకూ అది డిజిటల్ హెడ్ ఎండ్ గానే పరిగణనలో ఉంటుంది. కాబట్టి లైసెన్సుకు ఢోకా లేదు. పే చానల్స్ తో ఒప్పందాలు చేసుకోవచ్చు.

దీంతో హైదరాబాద్, విజయవాడ తదితర నగరాల్లో  ఉండే ఎమ్మెస్వో నుంచి ఫీడ్ తీసుకోవటం కంటే హిట్స్ మీద ఆధారపడటం మంచిదన్న అభిప్రాయం మొదలైంది. డిజిటల్ ఎమ్మెస్వో  లైసెన్సును, తద్వారా తన అస్తిత్వాన్ని, వ్యాపారాన్ని కాపాడుకోవటానికి హిట్స్ ఒక్కటే మార్గమని ఎమ్మెస్వోలు భావిస్తున్నారు.  డిజిటల్ హెడ్ ఎండ్ ఉన్న పెద్ద ఎమ్మెస్వోను నమ్ముకుంటే సొంత కనెక్షన్లు ఎన్ని ఉన్నా, కేవలం ఒక ఆపరేటర్ స్థాయికి మాత్రమే పరిమితమయ్యే ప్రమాదమున్నదని భావిస్తున్నారు.