• Home »
  • Entertainment »
  • 20న ఫిలింఫేర్-2018 అవార్డుల కార్యక్రమం

20న ఫిలింఫేర్-2018 అవార్డుల కార్యక్రమం

63వ జియో ఫిలిం ఫేర్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల 20 న కలర్స్ ప్రసారం చేయబోతోంది. 2017 లో విడుదలైన చిత్రాలలో అద్భుతమైన ప్రతిభ కనబరచిన కళాకారులని ఈ సందర్భంగా ప్రతిష్ఠాత్మకమైన ఫిలింఫేర్ అవార్డుతో సత్కరిస్తారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులందరూ పాల్గొనడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.

జాతీయ స్థాయిలో పేరు మోసిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వేగంగా ఎదుగుతున్నకలర్స్ చానల్ లో ప్రసారం చేయటం సంతోషంగా ఉందని వయాకామ్ 18 సీవోవో రాజ్ నాయక్ చెప్పారు. ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో ఎంతోమంది ఆసక్తితో ఎదురు చూసే కార్యక్రమ కాగా జియో ఫిల్మ్ ఫేర్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా చేరటం మరింత సంతోషకరమన్నారు.