• Home »
  • Circulars »
  • జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సహాయానికి దరఖాస్తులు

జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సహాయానికి దరఖాస్తులు

జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి మంజూరు చేసే ఆర్థిక సహాయం కోసం ఈ నెల 22 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ ఒక ప్రకటనలో కోరారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు, జర్నలిస్టు వృత్తిలో ఉంటూ అనారోగ్యం బారినపడి నడవలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోవాలి.

www.ipr.tg.nic.in నుంచి దరఖాస్తులు డౌన్ లోడ్ చేసుకొని సంబంధిత పౌర సంబంధాల అధికారులైన ఉప సంచాలకులు, సహాయ సంచాలకులు, డిపీఆర్వోల ద్వారా ధ్రువీకరింపజేసిన మీదట హైదరాబాద్ లోని మీడియా అకాడెమీ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. వివరాలకోసం 040-23298672 లేదా 040-23298674 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.