• Home »
  • Cable »
  • విదేశీ పెట్టుబడులకు ’ డెన్’ కి గ్రీన్ సిగ్నల్

విదేశీ పెట్టుబడులకు ’ డెన్’ కి గ్రీన్ సిగ్నల్

జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎమ్మెస్వో డెన్ కు ఎట్టకేలకు విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు స్వీకరించటానికి అనుమతి లభించింది. ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్స్  ప్రమోషన్ బోర్డ్ ( ఎఫ్ ఐ పి బి ) ఇప్పుడున్న  49 శాతం పరిమితిని 74 శాతానికి పెంచటానికి ఒప్పుకుంది. దీంతో డిజిటైజేషన్ మూడు, నాలుగు దశల్లో తలపెట్టిన భారీ విస్తరణకు, బ్రాడ్ బాండ్ వ్యాపారానికి అండ దొరికినట్టయింది.

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లనుంచి, ఎన్నారైల నుంచిపెట్టుబడులు తీసుకోవటంతో బాటు ఓపెన్ మార్కెట్ నుంచు పెట్టుబడులు సేకరించటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా డెన్ నెట్ వర్క్స్ కొంతకాల కిందట దరఖాస్తు చేసుకొని గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తూ వచ్చింది. గత మార్చి లోనే డెన్ నెట్ వర్క్ డైరెక్టర్ల బోర్డు ఈ ప్రతిపాదనను ఆమోదించి పంపింది. ప్రస్తుతం డెన్ నెట్ వర్క్స్ లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులి 20.27%  ఉన్నాయి