• Home »
  • Broadband »
  • కేబుల్ చందాదారులకు ఉచిత బ్రాడ్ బాండ్ ప్రకటించిన ఆర్టెల్

కేబుల్ చందాదారులకు ఉచిత బ్రాడ్ బాండ్ ప్రకటించిన ఆర్టెల్

ప్రముఖ కేబుల్ టీవీ, బ్రాడ్ బాండ్ సంస్థ ఆర్టెల్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ తన చందాదారులకోసం ఉచిత బ్రాడ్ బాండ్ పథకం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఒడిశా, పశ్చిమబెంగాల్, చత్తీస్ గఢ్ చందాదారులకోసం ప్రత్యేకంగా ఏడాదిపాటు ఈ సౌకర్యం కల్పిస్తునట్టు పేర్కొంది. ప్రతినెలా ఒక పరిమితి వరకు ఉచితంగా అందిస్తూ. ఆ పైన నామామాత్రపు చందా చెల్లించే విధంగా ఈ సర్వీసు రూపొందించారు.

అయితే, ఎవరైనా చందాదారు ఇప్పుడున్న మరేదైనా ప్లాన్ కి మారాలనుకుంటే ఆఫర్ అమలులో ఉండే ఏడాదికాలంలో మారవచ్చునని కూడా ఆర్టెల్ స్పష్టం చేసింది. ఈ ఉచిత ఆఫర్ లో భాగంగా చందాదారులకు అపరిమితంగా అప్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్ ను అందుబాటు ధరలోకి తీసుకురావటం ద్వారా మారుమూల ప్రదేశాలకు చొచ్చుకుపోవటమే తమ లక్ష్యమని ఆర్టెల్ సీఈవో బిభూ ప్రసాద్ రథ్ చెప్పారు.

ఆర్టెల్ ఈ మధ్యనే డాక్సిస్ 3.0 టెక్నాలజీ ద్వారా అత్యంత వేగంగా ఇంటర్నెట్ అందుకోగలిగే అవకాశం తన చందాదారులకు కల్పించింది. రివర్స్ పాత్ తో సహా సొంత నెట్ వర్క్ ఏర్పాటుచేసుకోవటంతోబాటు ఈ సంస్థ 50 ఎంబిపిఎస్ తో మెగా స్పీడ్ బ్రాడ్ బాండ్ కూ శ్రీకారం చుట్టింది. భువనేశ్వర్ లోని కొన్ని ఎంపికచేసిన ప్రదేశాలలో దీన్ని ఆచరణలో పెట్టింది.