• Home »
  • Entertainment »
  • సింగపూర్ ప్రేక్షకులకోసం రెండు జెమినీ చానల్స్

సింగపూర్ ప్రేక్షకులకోసం రెండు జెమినీ చానల్స్

సింగపూర్ ప్రేక్షకుల కోసం టీవీ చానల్స్ అందించే సింగ్ టెల్ పంపిణీ సంస్థ తాజాగా జోడించిన ఐదు భారతీయ చానల్స్ లో జెమినీ, జెమినీ మూవీస్ తో బాటు ఒక తమిళ చానల్, రెండు మలయాళీ చానల్స్ ఉన్నాయి. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు చానల్స్ కలుపుకుంటూ పోతున్నామని సింగ్ టెల్ ఎండీ గోహ్ సియీ ఇంగ్ చెబుతున్నారు.

సింగపూర్ లో చానల్స్ ప్రసారం కావాలంటే అక్కడ  ప్రభుత్వ అనుమతి అవసరం. అదే సమయంలో వివిధ దేశాల ప్రజలు అక్కడ నివసిస్తూ ఉండటం వలన వీలైనంత మందిని సంతృప్తిపరచే విధంగా ఎక్కువ చానల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకు సింగ్ టెల్ అందిస్తున్న చానల్స్ సంఖ్య 190 కి చేరుకుంది.

తమిళంలో ఆస్ట్రో విన్మీన్ హెచ్ డి అనే ఆస్ట్రలాజికల్ చానల్ తోబాటు మలయాళంలో సన్ గ్రూపు వారి జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్ సూర్య టీవీ, మూవీ చానల్ కిరణ్ టీవీ కూడా ఇప్పుడు తాజాగా చేరిన ఐదు భారతీయ చానల్స్ లో ఉన్నాయి. జులై ఆఖరువరకు ఈ చానల్స్  ఉచిత ప్రివ్యూ అందుబాటులో ఉంటుందని, నచ్చునవాళ్ళు పే చానల్ గా చందాలు కట్టవచ్చునని సింగ్ టెల్ ప్రకటించింది.