• Home »
  • BARC »
  • జెమినీదే ఆధిక్యం, మారని రాంకులు : కెరటాలు, సైమా అవార్డులకు ఆదరణ

జెమినీదే ఆధిక్యం, మారని రాంకులు : కెరటాలు, సైమా అవార్డులకు ఆదరణ

వరుసగా నాలుగోవారం కూడా జెమినీ తన ఆధిక్యాన్ని చాటుకుంది. ఆగస్టు 20 నుంచి 26 వరకు సాగిన 34వ వారంలో తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో నెంబర్ వన్ స్థానంలో స్థిరంగా కొనసాగింది. రెండో స్థానంలో ఉన్న ఈటీవీ కంటే దాదాపు 17 శాతం ఆధిక్యం కనబరచింది. జీ తెలుగు మూడో స్థానంలోను, మా టీవీ నాలుగో స్థానంలోను కొనసాగుతున్నాయి.

బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) అందించిన ప్రేక్షకాదరణ సమాచారం ప్రకారం జెమిని (480504), ఈటీవీ (412357), జీ తెలుగు (393432), మా టీవీ (353690 )  వరుసగా నాలుగు స్థానాలు సంపాదించుకున్నాయి. జెమినీ మూవీస్ (176275) కు ఐదవ స్థానం దక్కింది. ఆవిధంగా మిగిలిన మూవీ చానల్స్ కంటే ఆధిక్యంలో ఉన్నట్టు చాటుకుంది.

కార్యక్రమాలకు లభించిన ప్రేక్షకాదరణ ప్రకారం చూస్తే  టాప్ 5 లో ఈటీవీ సీరియల్ మనసు మమత (6245), జీ తెలుగు ముద్ద మందారం (6038), జెమిని సైమా అవార్డుల కార్యక్రమం (5888), ఈటీవీ వారి నా పేరు మీనాక్షి సీరియల్ (5349),    జెమిని సీరియల్ కెరటాలు ( 5267)  ఉన్నాయి. ఎక్కువ సేపు ప్రసారం కావటం వలన జెమిని సైమా అవార్డుల కార్యక్రమం జెమినీని మొదటి స్థానంలో నిలబెట్టటంలో కీలకంగా మారింది.