• Home »
  • Audience »
  • 2017 చివరి వారంలోనూ జెమిని నెం.1

2017 చివరి వారంలోనూ జెమిని నెం.1

2017 డిసెంబర్ 23-29 తేదీల మధ్య సాగిన చివరి వారానికి బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అందించిన సమాచారాం ప్రకారం జెమిని టీవీ తన మొదటి ర్యాంకును కొనసాగించింది. అదే విధంగా ఈ టీవీ కూడా రెండో స్థానంలోనే కొనసాగుతూ వచ్చింది. మూడు, నాలుగు స్థానాల్లో స్టార్ మా, జీ తెలుగు నిలిచాయి. ఇక సినిమా చానల్స్ విషయానికొస్తే స్టార్ మా మూవీస్ అన్నిటికంటే ముందుంది.    

చానల్ వీక్షణలు (వేలల్లో) ర్యాంకు
జెమిని టీవీ 529842 1
ఈటీవీ తెలుగు 494393 2
స్టార్ మా 458945 3
జీ తెలుగు 437478 4

కార్యక్రమాల్లో మొదటి 5 స్థానాలు

సాయంత్రం 6 గంటలనుంచి రాత్రి 11.30 వరకు సాగే ప్రైమ్ టైమ్ లో వివిధ చానల్స్ లో ప్రసారమయ్యే కార్యక్రమాల ప్రేక్షకాదరణ ఆధారంగా తొలి ఐదు కార్యక్రమాలు ఇవి: 

చానల్ కార్యక్రమం వీక్షణలు (వేలల్లో) ర్యాంకు
ఈటీవీ తెలుగు స్వాతి చినుకులు 8625 1
ఈటీవీ తెలుగు మనసు మమత 7583 2
ఈటీవీ తెలుగు నా పేరు మీనాక్షి 7372 3
స్టార్ మా కార్తీక దీపం 7011 4
జీ తెలుగు ముద్ద మందారం 6728 5

ఈటీవీ సీరియల్స్ మొదటి మూడు ర్యాంకులూ సాధించగా స్టార్ మా, జీ తెలుగు చానల్స్ ఆ తరువాత ఒక్కో రాంకు దక్కించుకున్నాయి. మొత్తంగా నెంబర్ వన్ అయినప్పటికీ జెమిని టీవీకి తన సీరియల్స్ లో ఒక్కటీ టాప్ ఫైవ్ లో స్థానం దక్కలేదు.