• Home »
  • BARC »
  • నెం.1 జెమినీ, మూడో స్థానంలోకి ’మా’: టాప్ 5 లో కార్యక్రమాల్లో ఎక్స్ట్రా జబర్దస్త్

నెం.1 జెమినీ, మూడో స్థానంలోకి ’మా’: టాప్ 5 లో కార్యక్రమాల్లో ఎక్స్ట్రా జబర్దస్త్

ఆగస్టు 27- సెప్టెంబర్ 2 తేదీల మధ్య సాగిన 35వ వారంలోనూ తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో జెమినీ టీవీ తన నెంబర్ వన్ స్థానాన్ని కొనసాగించింది. అయితే, రెండో స్థానంలో ఉన్న ఈటీవీ కంటే ఆధిక్యం మాత్రం గతవారం కంటే బాగా తగ్గింది. వరుసగా నాలుగో స్థానానికే పరిమితమవుతూ వస్తున్న  మా టీవీ ఈ వారం మూడో స్థానానికి ఎగబాకటంతో జీ తెలుగు నాలుగో స్థానానికి పడిపోయింది.

బార్క్ వెల్లడించిన సమాచారం ప్రకారం జెమిని (446878), ఈటీవీ (424060 ) , మా టీవీ (382970 ) , జీ తెలుగు (378473 ), జెమిని మూవీస్ (166096 )రాంకులవారీగా ఈ ప్రేక్షకాదరణ నమోదు చేసుకున్నాయి. జాతీయ స్థాయిలో సన్ టీవీ తిరుగులేని నెంబర్ వన్ స్థానంలో ఉండగా జెమిని ఆరో స్థానంలోను, ఈటీవీ రెండో స్థానంలోను ఉన్నాయి. ఆ విధంగా జాతీయ స్థాయి టాప్ టెన్ లో లో దక్షిణాదిన ఒకే భాష నుంచి రెండు చానల్స్  స్థానం సంపాదించుకోవటం తెలుగుకే చెల్లింది. అయితే, జెమిని, ఈటీవీ కలిపినా సన్ టీవీ ఆదరణకంటే తక్కువే ఉండటం గమనార్హం.

కార్యక్రమాల విషయానికొస్తే, ప్రైమ్ టైమ్ లో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన మొదటి ఐదు కార్యక్రమాలలో మూడింటిని ఈటీవీ సొంతం చేసుకుంది. జీ తెలుగులో ప్రసారమయ్యే ముద్దమందారం సీరియల్ (6200) నెంబర్ వన్ కార్యక్రమంగా ప్రేక్షకాదరణ పొందగా ఈ టీవీ సీరియల్స్ మనసు మమత (6101), నా పేరు మీనాక్షి (5406) రెండు, మూడు రాంకుల్లో నిలిచాయి. ఈటీవీ వారి ఎక్స్ట్రా జబర్దస్ట్ (5393) నాలుగో స్థానంలో ఉండగా జెమినీ టీవీ సీరియల్ కెరటాలు (5331) ఈ వారం కూడా టాప్ 5 లో స్థానం నిలబెట్టుకుంది. మా టీవీ కార్యక్రమాలేవీ మొదటి ఐదింటిలో లేవు.