• Home »
  • BARC »
  • కొనసాగుతున్న జెమినీ టీవీ ఆధిక్యం: ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు మధ్య పోటీ

కొనసాగుతున్న జెమినీ టీవీ ఆధిక్యం: ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు మధ్య పోటీ

డిసెంబర్ 17-23 తేదీల మధ్య సాగిన 51 వ వారంలోనూ జెమినీ టీవీ ఆధిక్యం కొనసాగింది. తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో కొంతకాలంగా జెమిని టీవీ ఆధిపత్యం కనిపిస్తూ ఉండగా మిగిలిన మూడు ప్రధాన చానల్స్ మధ్య గట్టిపోటీ నెలకొన్నది.

బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) తాజాగా విడుదల చేసిన రేటింగ్స్  సమాచారం ప్రకారం తెలుగు చానల్స్ లో జెమిని టీవీ (485334) నెంబర్ వన్ స్థానంలో ఉండగా ఈ టీవీ (485334), జీ తెలుగు (399458 ), మా టీవీ (395460 ) ఆ తరువాత మూడు స్థానాల్లో ఉన్నాయి. జెమినీ కంటే బాగా వెనుకబడినప్పటికీ ఈ మూడు చానల్స్ మధ్య తేడా చాలా తక్కువగా ఉండటంతో గట్టి పోటీ కనిపిస్తోంది.

కార్యక్రమాల విషయానికొస్తే  ఈ టీవీ సీరియల్ మనసు మమత అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమంగా తేలింది. మా టీవీ లో ప్రసారమయ్యే కుంకుమ పువ్వు , జీ తెలుగులో ప్రసారమయ్యే ముద్ద మందారం, మా టీవీ సీరియల్ కోయిలమ్మ  వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. జెమిని లో ప్రసారమైన తెలుగు చలన చిత్రం టెంపర్ కు ఐదవ ర్యాంక్ లభించింది.