• Home »
  • Audience »
  • జెమిని, ఈటీవీ కే మొదటి ర్యాంకులు – పోటాపోటీగా జీ తెలుగు, స్టార్ మా

జెమిని, ఈటీవీ కే మొదటి ర్యాంకులు – పోటాపోటీగా జీ తెలుగు, స్టార్ మా

బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ బార్క్ డిసెంబర్ 30-జనవరి 5 మధ్య సాగిన 2018 మొదటివారం రేటింగ్స్ వెల్లడించింది. ఈ ఏడాది మొదటి వారం ఫలితాల్లోనూ జెమిని టీవీ మొదటి స్థానం సంపాదించగా ఈటీవీ రెండో స్థానాన్ని స్థిరంగా కాపాడుకుంటూ వస్తోంది.  ఈ రెండు చానల్స్ కు కాస్త దూరంగా మిగిలిపోయిన జీ తెలుగు, స్టార్ మా మధ్య గట్టిపోటీ నెలకొనగా మూడో స్థానం లో జీ తెలుగు, నాలుగో స్థానంలో స్టార్ మా ఉన్నాయి. ఇక సినిమా చానల్స్ విషయానికొస్తే జెమినీ మూవీస్ ముందంజలో ఉంది.

చానల్ వీక్షణలు ( వేలల్లో) ర్యాంకు
జెమిని టీవీ 539184 1
ఈటీవీ తెలుగు 510793 2
జీ తెలుగు 443868 3
స్టార్ మా 442493 4

 

అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన మొదటి 5 కార్యక్రమాల జాబితా విషయానికొస్తే, ఈటీవీ సీరియల్స్ మూడింటికి ఇందులో చోటు దక్కగా స్టార్ మా లో ప్రసారమైన ఫిదా సినిమా రెండో స్థానం. అదే చానల్ సీరియల్ కార్తీక దీపం ఐదో స్థానం దక్కించుకున్నాయి. ఈటీవీ వారి సీరియల్స్  స్వాతి చినుకులు మొదటి స్థానం లోను, మనసు మమత మూడో స్థానంలోను, నా పేరు మీనాక్షి నాలుగో స్థానంలోను నిలిచాయి.