రేపటినుంచి జెమిని లో ’నాగిని’

సోనీ నుంచి జై హనుమాన్, కలర్స్ నుంచి నాగిన్ డబ్బింగ్ హక్కులు కొనుక్కోవటం ద్వారా సన్ నెట్ వర్క్ పౌరాణికాల మీద దృష్టి సారించింది. జై హనుమాన్ ఇప్పటికే మొదలుకాగా నాగిన్ ని ప్రైమ్ టైమ్ లో ప్రసారం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రేపటినుంచి జెమిని ( వేటాడే నాగిని), సూర్య ( మలయాళంలో నాగ కన్యక పేరుతో ) చానల్స్ లో నాగిని ప్రసారం కాబోతోంది. అయితే, సూర్య లో రోజుకు గంటపాటు ప్రసారం చేయాలనుఇ నిర్ణయించగా జెమినిలో మాత్రం అరగంటకే పరిమితమవుతుంది.

అటు సోనీకి గాని, ఇటు కలర్స్ కు గాని దక్షిణాదిన ప్రాంతీయ చానల్స్ లేకపోవటంతో సన్ నెట్ వర్క్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. కలర్స్ కు కర్నాటకలో మాత్రం కలర్స్ కన్నడ చానల్ ఉంది. కలర్స్ లో ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ సీరియల్ కు ప్రేమ, పగ, అతీంద్రియ శక్తులు నేపథ్యంగా ఉండటంతో దక్షిణాదిన కూదా విజయం సాధిస్తుందని సన్ నెట్ వర్క్ అంచనావేస్తోంది.

ఇలా ఉండగా జెమిని టీవీ తన సీరియల్స్ ప్రసార సమయాలలోనూ కొద్దిపాటి మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. అత్తో అత్తమ్మ కూతురో సీరియల్ ఇక మీదట రాత్రి 7.30 కి, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే సీరియల్ రాత్రి 9.30 కి ప్రసారమవుతాయి. రాత్రి 9 గంటలనుంచి 9.30 వరకు నాగిని ప్రసారమవుతుంది.