• Home »
  • Cable »
  • గుత్తి (వాసవి), మూసాపేట్ (పాలమూర్ డిజిటల్) కు డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ లు

గుత్తి (వాసవి), మూసాపేట్ (పాలమూర్ డిజిటల్) కు డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ లు

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా మరో 39 తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేసింది. అందులో తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన రాజ్ కేబుల్ టీవీ నెట్ వర్క్ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి  రాష్ట్రాలకు తాత్కాలిక ఎమ్మెస్వోగా లైసెన్స్ పొందింది. దీంతో దేశవ్యాప్తంగా లైసెన్స్ పొందిన తాత్కాలిక ఎమ్మెస్వోల సంఖ్య 564 కు చేరింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్కొక్కరికి చొప్పున ఈ విడతలో లైసెన్స్ వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా ఘనపూర్ మండలం మూసాపేటకు చెందిన పాలమూర్ డిజిటల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా, కర్నాటకలోని రాయచూర్ జిల్లాతోబాటు మొత్తం తెలంగాణ రాష్ట్రమంతటా డిజిటల్ కేబుల్ టీవీ కార్యకలాపాలందించేందుకు మార్చి 4న  లైసెన్స్ లభించింది.

అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన వాసవీ కమ్యూనికేషన్స్ కు కూడా తాత్కాలిక డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ మంజూరైంది. ఈ ఎమ్మెస్వో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలో మూడు, నాలుగు దశల ప్రాంతాల్లో డిజిటల్ కార్యకలాపాలు నడుకునేందుకు మార్చి 21 న లైసెన్స్ మంజూరైంది. ఈ లైసెన్సులు పదేళ్ళ పాటు అమలులో ఉంటాయి.