• Home »
  • Entertainment »
  • ప్రభుత్వ ప్రకటనలమీద ఏటా 1000 కోట్లు : ఎలక్ట్రానికి మీడియాకే ఎక్కువ వాటా

ప్రభుత్వ ప్రకటనలమీద ఏటా 1000 కోట్లు : ఎలక్ట్రానికి మీడియాకే ఎక్కువ వాటా

కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో ప్రకటనలమీద రూ.1000 కోట్లు ఖర్చు చేసింది. అందులో పత్రికలకంటే ఎలక్ట్రానిక్ మీడియాకే ఎక్కువ ఖర్చుచేసినట్టు సమాచార, ప్రసార శాఖామంత్రి అరుణ జైట్లీ పార్లమెంటుకు తెలియజేశారు. ప్రభుత్వ ప్రకటనల జారీకి నోడల ఏజెన్సీగా వ్యవహరించే డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టయిజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ ( డిఎవిపి) ద్వారా ప్రభుత్వం ఈ ప్రకటనలను వెలువరిస్తుంది.

ప్రింట్ మీడియా మీద రూ. 424 కోట్ల 84 లక్షలు ఖర్చుచేయగా ఎలక్ట్రానికి మీడియా మీద రూ. 473 కోట్ల 67 లక్షలు ఖర్చు చేశారు. ఇందులో టీవీ, రేడియో, ఇంటర్నెట్, సినిమా, డిజిటల్, ఎస్ ఎమ్ ఎస్ ఉన్నాయి. ఎగ్జిబిషన్లు, హోర్డింగులు తదితర ఔట్ డోర్ పబ్లిసిటీ, కరపత్రాలు, చిన్న పుస్తకాలు కలిపి రూ.81 కోట్ల 27 లక్షలు ఖర్చు చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రకటనల వ్యయం రూ. 998 కోట్ల 34 లక్షలు