• Home »
  • Cable »
  • మూడో దశ పట్టణప్రాంతాల సవరించిన జాబితా విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

మూడో దశ పట్టణప్రాంతాల సవరించిన జాబితా విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

మూడవ దశ డిజిటైజేషన్ పరిధిలోకి వచ్చే పట్టణ ప్రాంతాల జాబితాను కొద్దిపాటి సవరణలతో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ విడుదల చేసింది. మొత్తం 16 రాష్ట్రాలతోబాటు కేంద్రపాలితప్రాంతాలు కూడా ఈ మూడవ దశలో ఉన్నాయి. ఆయా రాష్ట ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వం ఈ సవరణ చేపట్టింది. అలా సవరించిన జాబితాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇంకా అరుణాచల ప్రదేశ్, అస్సాం, గుజరాత్, హర్యానా, హిమాచలప్రదేశ్, జార్ఖండ్, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అండమాన్, నికోబార్ దీవులు, పుదుచ్చేరి ఉన్నాయి.

మూడోదశలో మొత్తం 3 కోట్ల 87 లక్షల 90 వేల టీవీ ఇళ్ళు ఉన్నాయి. ఇవి 630 జిల్లాల్లోని 7,709 పట్టణప్రాంతాల్లో వ్యాపించి ఉన్నాయని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జారీచేసిన డేటా చెబుతోంది. పది లక్షల టీవీ ఇళ్ళు దాటిన రాష్ట్రాలు 13 ఉండగా అన్నిటికంటే ఎక్కువగా తమిళనాడులో 66 లక్షల ఇళ్లు డిజిటైజ్ కావాల్సి ఉన్నాయి. లక్షదీవులలో కేవలం 5,493 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. మొదటి దశలో నాలుగు మెట్రో నగరాలు, రెండో దశలో 38 నగరాలు ఉన్న సంగతి తెలిసిందే.