• Home »
  • Cable »
  • రూ.150 కోట్లు సమీకరించబోతున్న జిటిపిఎల్-హాత్ వే

రూ.150 కోట్లు సమీకరించబోతున్న జిటిపిఎల్-హాత్ వే

జిటిపిఎల్, హాత్ వే సంస్థలు ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న ఎమ్మెస్వో సుమారు 90 లక్షల వాటాలు పైవేటుగా అమ్మటం ద్వారా రూ.150 కోట్లు సమీకరించటానికి సిద్ధమైంది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ దగ్గర ప్రాస్పెక్టస్ విడుదలచేయకముందే ఈ వాటాల కేటాయింపు పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఆ విధంగా ముందుగానే వాటాలలో ఎక్కువభాగం అమ్మగలిగితే ఆఫర్ పరిమాణం తగ్గటానికి అవకాశముంది.

2016 సెప్టెంబర్ 30 నాటికి జిటిపిఎల్ హాత్ వే సంస్థ వారి డిజిటల్ కేబుల్ సేవలు దేశవ్యాప్తంగా 169 పట్టణాలకు విస్తరించి ఉన్నాయి. వాటిలో గుజరాత్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, అస్సాం, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పట్టణాలున్నాయి.

ఈ సంస్థ 61 లక్షల 90 వేల సెట్ టాప్ బాక్సులను అమర్చగా ప్రస్తుతం చురుగ్గా ఉన్న కేబుల్ చందాదారుల సంఖ్య 54 లక్షల 10 వేలు.  ఆగస్టు 31 నాటికి 20 లక్షల 20 వేల అనలాగ్ చందాదారులున్నారని, వారంతా డిజిటల్ సెట్ టాప్ బాక్సుల కోసం ఎదురు చూస్తున్నారని సంస్థ వెల్లడించింది. అదే విధంగా సెప్టెంబర్ 30 నాటికి ఈ సంస్థ పరిధిలో 2,17,823 బ్రాడ్ బాండ్ కనెక్షన్లున్నాయి.  గడిచిన ఆర్థిక సంవత్సరంలో  రూ.844 కోట్ల 55 లక్షల ఆదాయం సమకూరగా రూ.69 కోట్ల నికరలాభం సంపాదించింది.