• Home »
  • Top Stories »
  • హాత్ వే బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జా

హాత్ వే బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జా

 

sania-mirza-1
పెద్ద ఎమ్మెస్వోగా జాతీయ స్థాయిలో ఎదిగిన హాత్ వే తన బ్రాడ్ బాండ్  వ్యాపారానికి ప్రచారకర్తగా  టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని ఎంచుకుంది.  అత్యధిక వేగానికి, స్థిరత్వానికి, పనితీరుకు  మారుపేరైన సానియా మీర్జా  తమ బ్రాడ్ బాండ్ పనితీరుతో పోలి ఉండటం వలన ఆమె సరైన  బ్రాండ్  అంబాసిడర్ అవుతుందని భావిస్తున్నట్టు సంస్థ సీఈవో జగదీశ్ కుమార్  చెప్పారు.

hathway1

 

 

 

 

హాత్ వే ఇప్పుడు  50 ఎంబిపిఎస్ వేగం నినాదంతో బ్రాడ్ బాండ్ కు ప్రచారం  చేసుకుంటున్న సంగతి  తెలిసిందే. ఎలాంటి అంతరాయం లేకుండా  అవిచ్ఛిన్నంగా, సరసమైన ధరలకే బ్రాడ్ బాండ్ అందిస్తామని,   వినియోగదారులకు అద్భుతమైన అనుభవాన్ని ఇవ్వటమే లక్ష్యమని హాత్  వే చెప్పుకుంటోంది. ఇంటింటికీ హాత్ వే బ్రాడ్ బాండ్ అందేలా కృషి చేస్తూ  అందుకు తోడుగా ప్రచారానికి సానియామీర్జా ను ఎంచుకున్నట్టు సంస్థ  ప్రెసిడెంట్ రాజన్ గుప్తా వెల్లడించారు.