• Home »
  • Cable »
  • స్టుడియో ఎన్ న్యూస్, యోగి టీవీ ప్రసారాల నిలిపివేతకు హాత్ వే హెచ్చరిక

స్టుడియో ఎన్ న్యూస్, యోగి టీవీ ప్రసారాల నిలిపివేతకు హాత్ వే హెచ్చరిక

బకాయిలు చెల్లించని కారణంగా  స్టుడియో ఎన్ న్యూస్  చానల్ ను, అదే గ్రూపుకు చెందిన ఆధ్యాత్మిక చానల్ యోగి టీవీని ప్రసారం చేయటం నిలిపివేస్తామని  తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద కార్పొరేట్ ఎమ్మెస్వో అయిన హాత్ వే నోటీసు జారీ చేసింది. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఏదైనా చానల్ ప్రసారాలను పంపిణీ సంస్థలు నిలిపివేయాలంటే 21 రోజుల ముందుగా నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఈ నోటీసు పత్రికలలో ప్రచురింప జేసింది.

బకాయిలు అని మాత్రమే పేర్కొన్నప్పటికీ ఆ బకాయిలు కారేజ్ ఫీజు మాత్రమేనని చెప్పాల్సిందే. ఇప్పటికే టైమ్స్ గ్రూపుతో వివాదానికి తెరలేపిన హాత్ వే ఆ క్రమంలో బకాయి పడిన చానల్స్  అన్నిటికీ నోటీసులు జారీ చేసే ఉద్దేశంతో ఉన్నట్టు కనబడుతోంది. డిజిటైజేషన్ పూర్తయినట్టు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ దాని ఫలితంగా కారేజ్ ఉండకపోవచ్చునని, ఉన్నా నామమాత్రంగా ఉంటుందని వేసిన అంచనా తలకిందులైనట్టేనని బ్రాడ్ కాస్టర్లు వ్యాఖ్యానిస్తున్నారు.