• Home »
  • Cable TV »
  • కారేజ్ పీజు కట్టని టైమ్స్ చానల్స్ ప్రసారాలు నిలిపేసిన హాత్ వే

కారేజ్ పీజు కట్టని టైమ్స్ చానల్స్ ప్రసారాలు నిలిపేసిన హాత్ వే

 

హాత్ వే డిజిటల్ కేబుల్ టీవీ ఈ ఉదయం నుంచి టైమ్స్ నెట్ వర్క్ చానల్స్ ప్రసారాలు నిలిపివేసింది. దీంతో కీలకమైన నగరాలన్నిటిలో కలిపి దాదాపు కోటి ఇళ్ళకు టైమ్స్  గ్రూప్ చానల్స్ ఆగిపోయాయి. ఒప్పందం కొనసాగించటం మీద ఏకాభిప్రాయం కుదరకపోవటమే అందుకు కారణమని తెలుస్తోంది. ఫలితంగా హైదరాబాద్ బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాలలో దాదాపు కోటి ఇళ్ళలోఈ చానల్స్ అందటం లేదు. ఇలా ఉండగా ముంబై, బెంగళూరు నగరాలలో స్థానిక కేబుల్ ఆపరేటర్లు టైమ్స్ చానల్స్ స్థానంలో రిపబ్లిక్ టీవీ పెట్టటం విశేషం.

మార్చి చివరి వరకూ అమలులో ఉండాల్సిన  పంపిణీ ఒప్పందాన్ని అమలు చేయటానికి  టైమ్స్ నెట్ వర్క్ నిరాకరించటం వల్లనే  ఈ పరిస్థితి తలెత్తిందని హాత్ వే వర్గాలు చెబుతున్నాయి, అయితే, డీమానిటైజేషన్, జి ఎస్ టి ఆరణంగా లాభాలు తగ్గిపోవటం వల్లనే ఆ ఒప్పందాలు అమలు చేయలేకపోతున్నట్టు  టైమ్స్ చెప్పుకుంటున్నట్టు తెలిసింది. అయితే, ఈ కారణాలను హాత్ వే ఒప్పుకోవటం లేదు. ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిందేనని పట్టుబట్టింది. అలా కారేజ్ ఫీజుకట్టని కారణంగా నెట్ వర్క్ చానల్స్ ను తొలగిస్తున్నట్టు హాత్ వే ప్రకటించింది.

ఒప్పందం ప్రకారం కారేజ్ ఫీజు చెల్లించని పక్షంలో జనవరి 10 నుంచి ప్రసారాలు నిలిపివేస్తామంటూ హాత్ వే నెలరోజులుగా ఒక స్క్రోల్ నడుపుతూ వచ్చింది. ప్రేక్షకులు ప్రత్యామ్నాయ మార్గాలుచూసుకోవాలని కూడా అందులో విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు నిలిపేసిన టైమ్స్ నెట్ వర్క్ చానల్స్ లో టైమ్స్ నౌ, టైమ్స్ నౌ హెచ్ డి, ఇటి నౌ, మిర్రర్ నౌ, మూవీస్ నౌ హెచ్ డి,మ్ ఎనెక్స్, ఎమ్ ఎన్ +, ఎమ్ ఎస్ ఎక్స్ హెచ్ డి, ఒమిడీ నౌ, రోమిడీ నౌ హెచ్ డి, జూమ్ ఉన్నాయి.

.