• Home »
  • Cable »
  • 25.6 % పెరిగిన హాత్ వే ఆదాయం

25.6 % పెరిగిన హాత్ వే ఆదాయం

జాతీయ స్థాయిలో పేరుమోసిన ఎమ్మెస్వో హాత్ వే కేబుల్ అండ్ డేటాకామ్ లిమిటెడ్ మూడవ త్రైమాసికంలో 25.6 శాతం ఆదాయం పెంచుకోగలిగింది. 2015 డిసెంబర్ 31 తో ముగిసిన త్రైమాసికానికి వ్యాపార కార్యకలాపాల ద్వారా రూ.300 కోట్ల 43 లక్షలు సంపాదించగా నిరుడు ఇదే త్రైమాసికానికి రూ.239 కోట్ల 15 లక్షలు మాత్రమే ఆర్జించింది.

ఇదే త్రైమాసికానికి అయిన ఖర్చు రూ. 314 కోట్ల 27 లక్షల రూపాయలు కాగా అంతకు ముందు అదే త్రైమాసికంలో అయిన ఖర్చు రూ. 301 కోట్ల 40 లక్షలు. పే చానల్స్ నుంచి ఆదాయం ఒక్కటే 11.3  శాతం పెరిగింది. అదే విధంగా ఎంప్లాయీ బెనిఫిట్ ఖర్చులు కూడా అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో అయిన ఖర్చులకంటే 37.4% పెరిగాయి