హిందీ సీరియల్స్ మీద మలయాళీల మోజు

హిందీ సీరియల్ యే హై మొహబ్బతే  ఇకమీదట మలయాళం మాట్లాడుతుంది. ఇప్పటికే  ఈ సీరియల్ ’మనసు పలికే మౌనగీతం ’ పేరుతో తెలుగులో డబ్ కాగా, తమిళంలో కల్యాణం ముదల్ కాదల్ వరై ( పెళ్ళి మొదలు ప్రేమ దాకా ) పేరుతో రీమేక్ అయింది. ఇప్పుడు మలయాళం లోనూ ప్రారంభం కాబోతోంది. అయితే, ఇది డబ్బింగ్ సీరియల్ గా కాకుండా రీమేక్ రూపంలో మలయాళీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

స్టార్ ప్లస్ వారి మలయాళ చానల్ ఏషియానెట్ లో సోమవారం నుంచి శనివారం వరకు ఈ నెల 6 నుంచి రాత్రి 7 గంటలకు  ఈ సీరియల్ రీ మేక్ వెర్షన్  ప్రసారమవుతుంది.  మలయాళంలో ఈ సీరియల్ పేరు ’ ప్రణయం’.  ఆ సమయంలో ఇప్పటిదాకా ప్రసారమవుతూ వచ్చిన సీరియల్ ’అమ్మ’ కూడా హిందీ నుంచి రీమేక్ చేసినదే.

మలయాళంలో వరుసగా హిందీ నుంచి రీమేక్ చేసిన సీరియల్స్ బాగా ప్రేక్షకాదరణ పొందుతూ ఉండటంతో ఏషియానెట్ హిందీ సీరియల్స్ మీద మొగ్గు చూపుతోంది. అమ్మ, చందనమళ, పరస్పరం కూడా ఇలాగే విశేష ప్రేక్షకాదరణ పొందాయి.