• Home »
  • Cable »
  • హిందుజా వారి కేబుల్, హిట్స్ వ్యాపారాల విలీనం

హిందుజా వారి కేబుల్, హిట్స్ వ్యాపారాల విలీనం

హిందుజా వెంచర్స్ లిమిటెడ్, గ్రాంట్ ఇన్వెస్ట్రేడ్ విలీనమవుతున్నాయి. ఇప్పటివరకు సబ్సిడరీ కంపెనీగా మాత్రమే ఉన్న గ్రాంట్ ఇన్వెస్ట్రేడ్ విలీనం కావటానికి హిందుజా వెంచర్ బోర్డ్ నిర్ణయించగా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆమోదముద్ర వేసింది. ఈ విలీనం 2017 అక్టోబర్ 1 నుంచేఅమలులో ఉన్నట్టు లెక్క.

ఈ విలీనం ఫలితంగా హిందుజా వారి కేబుల్ వ్యాపారం, హిట్స్ వ్యాపారం కలిసిపోతాయి.  అంటే, ఇండస్ ఇండ్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ ( ఐఎం సి ఎల్), గ్రాంట్ ఇన్వెస్ట్రేడ్ వారి నెక్స్ట్ డిజిటల్ కలిసిపోయి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తాయి.

ఈ కలయిక వలన వ్యాపార కార్యకలాపాలలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. నెట్ వర్త్ పెరగటం, ఉమ్మడి వ్యాపార ఖర్చులలో ఆదా కావటంతో బాటు పే చానల్స్ తో జరిపే బేరసారాల్లో కూడా ప్రయోజనం ఉంటుంది. తక్కువ ధరలకే చానల్స్ ను అందుకునే అవకాశం మెరుగుపడటం వలన వ్యాపారానికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.