• Home »
  • Cable »
  • 10 మంది ఎమ్మెస్వోలలో ఒకరికే లైసెన్స్, అదే హిందుజా ’నెక్స్ట్ డిజిటల్’ ఆయుధం

10 మంది ఎమ్మెస్వోలలో ఒకరికే లైసెన్స్, అదే హిందుజా ’నెక్స్ట్ డిజిటల్’ ఆయుధం

దేశ వ్యాప్తంగా 6 వేలమంది ఎమ్మెస్వోలు ఉండగా అందులో డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ ఉన్నవాళ్ళ సంఖ్య 600 కు మించలేదు. అంటే, ప్రతి 10 మందిలో 9 మంది కోట్లాది రూపాయలు వెచ్చించి డిజిటల్ హెడ్ ఎండ్ పెట్టుకునే పరిస్థితిలో లేరు. సరిగ్గా వీళ్ళనే లక్ష్యంగా చేసుకొని హిందుజా వారి హిట్స్ “ నెక్స్ట్ డిజిటల్ “ రంగ ప్రవేశం చేసిందని గ్రాంట్ ఇన్వెస్ట్రేడ్ సీఈవో టోనీ డిసిల్వా చెప్పారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో కనీసం 30 శాతం మార్కెట్ ను చేజిక్కించుకుంటామన్నారు.

నెక్స్ట్ డిజిటల్ ప్రారంభించటానికి ముందు 120 నగరాలు, పట్టణాలలో జరిపిన సర్వేలో స్వతంత్ర ఎమ్మెస్వోల, ఆపరేటర్ల అభిప్రాయాలను సేకరించామని, ప్రధానంగా  ఎమ్మెస్వోలు కోరుకుంటున్న అంశాల్లో ఇవి కీలకమని చెప్పారు.

  1. కోట్లలో కాకుండా పెట్టుబడి లక్షలకే పరిమితం కావటం
  2. తమ నెట్ వర్క్ మీద తమ యాజమాన్యమే కొనసాగటం
  3. బ్రాడ్ కాస్టర్లతో ( పే చానల్స్ తో ) తామే ఒప్పందాలు కుదుర్చుకోవటం
  4. మార్కెట్ కి తగినట్టు పాకేజ్ చేసుకోవటం, ధరలు నిర్ణయించుకోవటం
  5. వీలును బట్టి తక్కువ మొత్తాల్లో కూడా సెట్ టాప్ బాక్సులు కొనుక్కోగలగటం
  6. సొంత కేబుల్ చానల్స్ కొనసాగించగలగటం.

సర్వే లో వెల్లడైన అభిప్రాయాలను గౌరవిస్తూ, ఈ ఆరు అంశాలలో ఎమ్మెస్వోలను సంతృప్తి పరుస్తూ నెక్స్ట్ డిజిటల్ రూపొందించటం వల్లనే పెద్ద ఎత్తున ఒప్పందాలకు ముందుకు వస్తున్నారని చెప్పారు. డిజిటల్ ఎమ్మెస్వో గా లైసెన్స్ తీసుకొని కూడా పెట్టుబడి విషయంలో వెనకడుగేస్తున్నవారికి, లైసెన్స్ లేనివాళ్ళకు కూడా సరిపడేలా వేరు వేరు ఆఫర్ లు రూపొందించామన్నారు.

తక్కువ పెట్టుబడితో నాణ్యమైన ప్రసారాలు అందించడం, డిటిహెచ్ లో సాధ్యంకాని వాల్యూ యాడెడ్ సర్వీసులు సైతం అందించటం నెక్స్ట్ డిజిటల్  ప్రత్యేకతగా టోనీ డిసిల్వా అభివర్ణించారు. దీనివలన స్వతంత్ర ఎమ్మెస్వోలకు అదనపు ఆదాయ మార్గాలను కల్పించినట్టవుతుందన్నారు. నెక్స్ట్ డిజిటల్ లో ఇప్పటికే 480 కోట్ల రూపాయలు పెట్టుబడిపెట్టిన హిందుజా సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 120 కోట్లు పెట్టటానికి సిద్ధమైంది.

PC at HYD

హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతున్న గ్రాంట్ ఇన్వెస్ట్రేడ్ సీఈవో టోనీ డిసిల్వా