• Home »
  • Data & Projections »
  • 175% మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన హిందుజా వెంచర్స్

175% మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన హిందుజా వెంచర్స్

హెడ్ ఎండ్ ఇన్ ద స్కై ( హిట్స్ ) వేదిక నెక్స్ట్ డిజిటల్ ను నిర్వహించే గ్రాంట్ ఇన్వెస్ట్రేడ్ లిమిటెడ్ సహా ఇతర మీడియా కంపెనీలతో కూడిన హిందుజా వెంచర్స్ 2015-16 ఆర్థిక సంవత్సరానికి 175% మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. అంటే, రూ.10 ముఖ విలువ ఉన్న వాటాకు రూ, 17.50 చొప్పున డివిడెండ్ అందుతుంది. ఫలితంగా సంస్థ రూ.43 కోట్ల 30 లక్షల రూపాయలు డివిడెండ్ రూపంలో వాటదారులకు పంచుతోంది.

ఈ మొత్తాన్ని ఈ నెల 29 తరువాత పంపిణీ చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి తొమ్మిది నెలల కాలానికి పన్నులు పోను రూ. 86 కోట్ల 41 లక్షలు లాభం వచ్చినట్టు వెల్లడించింది. నిరుడు ఇదే కాలానికి వచ్చిన లాభం రూ. 74 కోట్ల 82 లక్షలు.

హిందుజా వెంచర్స్ లిమిటెడ్ వారి హిట్స్ వేదికను నెక్స్ట్ డిజిటల్ అనే బ్రాండ్ తో నిరుడు సెప్టెంబర్ 16 న ప్రారంభించారు. మూడు, నాలుగు దశల డిజిటైజేషన్లో అవ్చ్ఛిన్నంగా ప్రసారాలు అందించేందుకు నెక్స్ట్ డిజిటల్ పనిచేస్తోంది. స్వతంత్ర ఎమ్మెస్వోలకు అన్ని విధాలా అనుకూలంగా ఉండటంతో మూడు, నాలుగు దశలలో ఎక్కువమందిని విశేషంగా ఆకట్టుకోగలుగుతోంది.