• Home »
  • Cable »
  • హిట్స్ కార్యకలాపాల నిర్వహణకు హిందుజా నెక్స్ట్ డిజిటల్ కు గ్రీన్ సిగ్నల్

హిట్స్ కార్యకలాపాల నిర్వహణకు హిందుజా నెక్స్ట్ డిజిటల్ కు గ్రీన్ సిగ్నల్

హిందుజా వెంచర్స్ వారి అనుబంధ సంస్థ గ్రాంట్ ఇన్వెస్ట్రేడ్ లిమిటెడ్ చిట్టచివరి అవరోధాన్ని సైతం అధిగమించి ప్రసారాలకు శ్రీకారం చుట్టబోతోంది. హిట్స్ లైసెన్స్ పొందినప్పటికీ కార్యకలాపాల నిర్వహణకు చివరి అనుమతి వైర్ లెస్ ప్లానింగ్ అండ్ కో ఆర్డినేషన్ విభాగం నుంచి వైర్ లెస్ ఆపరేటింగ్ లైసెన్స్ రావాల్సి ఉంటుంది. ఇప్పుడు అది కూడా రావటంతో అధికారికంగా ప్రసారాలు ప్రారంభించటమే మిగిలింది.

లైసెన్స్ అందుకున్నట్టు ధ్రువీకరిస్తూ, డిజిటల్ ఇండియా ఉద్యమంలో భాగస్వాములౌతున్నందుకు ఆనందంగా ఉందని గ్రాంట్ ఇన్వెస్ట్రేడ్ చైర్మన్ ఎ కె దాస్ వ్యాఖ్యానించారు. కేబుల్ టీవీ పంపిణీ రంగంలో భాగస్వాములందరి దగ్గర నుంచీ విశేష స్పందన లభించిందనిమినీ హెడ్ ఎండ్ సిస్టమ్స్ తో బాటు అవసరమైన సెట్ టాప్ బాక్సులతో ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్టు సంస్థ ఎం.డి. టోనీ డి సిల్వా చెబుతున్నారు.

డిజిటైజేషన్ గడువు పెంచే ప్రసక్తే లేదని ప్రభుత్వం విస్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ లోగా పూర్తి కావాల్సిన మూడో దశలో నెక్స్ట్ డిజిటల్ కీలపాత్ర పాషించబోతోంది. ప్రభుత్వ విధానానికి తగిన వేగంతో ముందుకెళ్ళగలిగే సామర్థ్యం నెక్స్ట్ డిజిటల్ కు ఉండటం వల్ల నిర్దిష్ట గడువులోగా డిజిటైజ్ కావటానికి స్వతంత్ర ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు ఎంచుకోగలిగే ఏకైక అవకాశంగా మారింది