• Home »
  • Cable »
  • హిందుజా వారి నెక్స్ట్ డిజిటల్ ముందంజ : 3 వారాల్లో 10 లక్షల కనెక్షన్ల ఒప్పందాలు

హిందుజా వారి నెక్స్ట్ డిజిటల్ ముందంజ : 3 వారాల్లో 10 లక్షల కనెక్షన్ల ఒప్పందాలు

డిజిటైజేషన్ లో ఆలస్యంగా ప్రవేసించినా హిందుజా వారి హిట్స్ వేదిక నెక్స్ట్ డిజిటల్ తన ప్రవేశం సరైన సమయంలోనే జరిగినట్టు నిరూపించుకుంది. అధికారికంగా ప్రారంభించిన మొదటి మూడు వారాల్లోనే పది లక్షల మంది అనలాగ్ చందాదారులను తన పరిధిలోకి తెచ్చుకోగలిగింది. ఈ మేరకు ఆయా కేబుల్ ఆపరేటర్లు, స్వతంత్ర ఎమ్మెస్వోలతో ఒప్పందాలు కుదుర్చుకోగలిగినట్టు గ్రాంట్ ఇన్వెస్ట్రేడ్ ఎండీ టోనీ డిసిల్వా చెప్పారు.

కేబుల్ రంగం నెక్స్ట్ డిజిటల్ పట్ల అత్యంత ఆసక్తి కనబరుస్తోమ్దని, గత కొద్దిరోజులలో అనేక నగరాలలో జరిపిన సభలు, సమావేశాలు, వర్క్ షాప్స్ లో ఈ విషయం అర్థమైందని ఆయన అన్నారు. కేవలం అనలాగ్ నుంచి డిజిటల్ కు నడిపించే సహాయకారిగా మాత్రమే కాకుండా వారి స్వతంత్రతను గౌరవించి, కాపాడే సంస్థగా నెక్స్ట్ డిజిటల్ ను చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏళ్ళతరబడి నిర్మించుకున్న కేబుల్ నెట్ వర్క్ వ్యవస్థను కాపాడుకోవటానికి నెక్స్ట్ డిజిటల్ ను సరైన వేదికగా ఎంచుకుంటున్నారన్నారు.

నోయిడాలో ఏర్పాటు చేసిన అత్యాధునిక డిజితల్ హెడ్ ఎండ్ ఈ నెలాఖరునుంచి పనిచేయటం మొదలవుతుందని టోనీ ప్రకటించారు.  దేశవ్యాప్తంగా నెక్స్ట్ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ  ప్రస్తుతానికి మూడు, నాలుగు దశల మీదనే దృష్టి సారిస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని ప్రమాణాలూ పాటించటంతోబాటు చందాదారులకు నాణ్యమైన సేవలందించే అవకాశాన్ని ఎమ్మెస్వోలు పొందగలుగుతారని ధీమా వ్యక్తం చేశారు.