• Home »
  • Cable »
  • హిందూపురం ఎమ్మెస్వోకు డిజిటల్ లైసెన్స్

హిందూపురం ఎమ్మెస్వోకు డిజిటల్ లైసెన్స్

అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన హిందూపూర్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు డిజిటల్ ఎమ్మెస్వోగా తాత్కాలిక లైసెన్స్ మంజూరైంది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా మంజూరు చేసిన 14 లైసెన్సులలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ సంస్థ కూడా ఉంది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మంజూరైన మొత్తం డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్సుల సంఖ్య 567 కు చేరింది. ఈ లైసెన్స్ పదేళ్ళ పాటృ అమలులో ఉంటుంది.

నిజానికి డిజిటల్ ఎమ్మెస్వోల లైసెన్స్ మంజూరుకు హోం శాఖ క్లియరెన్స్ అవసరం లేదని కొద్ది నెలల కిందటే ప్రభుత్వం చెప్పినప్పటికీ, ఇప్పటివరకు అధికారికంగా ఉత్తర్వులు రాకపోవటంతో అన్నీ తాత్కాలిక లైసెన్సులే మంజూరవుతున్నాయి. ఈ విడత జారీచేసిన మొత్తం 14 లైసెన్సులలో అన్నీ తాత్కాలిక లైసెన్సులే. దీంతో ఇప్పటివరకు జారీ అయిన 567 లైసెన్సులలో 230 మాత్రమే శాశ్వత లైసెన్సులు.