• Home »
  • BARC »
  • ఇన్ఫొటైన్మెంట్ చానల్స్ లో హిస్టరీ టీవీ18 కే అధిక ప్రేక్షకాదరణ

ఇన్ఫొటైన్మెంట్ చానల్స్ లో హిస్టరీ టీవీ18 కే అధిక ప్రేక్షకాదరణ

విజ్ఞానం, వినోదం కలిపి అందించే ఇన్ఫొటైన్మెంట్ చానల్స్ విభాగంలో హిస్టరీ టీవీ18 కే అత్యధిక ప్రేక్షకాదరణ ఉన్నట్టు రేటింగ్స్ లెక్కలు చెబుతున్నాయి. మార్చి 26-ఏప్రిల్1 తేదీల మధ్య సాగిన 13 వ వారానికి బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ అందజేసిన సమాచారం ప్రకారం ప్రేక్షకాదరణలో హిస్టరీ టీవీ 18 దాని తరువాత స్థానంలో ఉన్న డిస్కవరీ కంటే దాదాపు 10 శాతం ఆధిక్యంలో ఉంది.

ఇన్ఫొటైన్మెంట్ చానల్స్ లో హిస్టరీ టీవీ 18 (5054 వేలు), డిస్కవరీ (4616 వేలు ) సంపాదించుకొని మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. నేషనల్ జాగ్రఫిక్ (3711 వేలు) మూడో స్థానంలోను, యానిమల్ ప్లానెట్ (2862 వేలు ) నాలుగో స్థానంలోను ఉండగా  నేషనల్ జాగ్రఫిక్ వైల్డ్ (1908 వేలు ) ఐదో స్థానంలో మిగిలింది.