• Home »
  • HITS »
  • HITS మీద సందేహాలూ, సమాధానాలూ

HITS మీద సందేహాలూ, సమాధానాలూ

హిట్స్ మీద సందేహాలూ, సమాధానాలూ

1. హిట్స్ లో ఇమిడి ఉన్న సాంకేతిక పరిజ్ఞానమేంటి ?

జ : హిట్స్ అంటే హెడ్ ఎండ్ ఇన్ ద స్కై (HEAD END IN THE SKY – HITS)
• ఇది చౌకధరలో దేశవ్యాప్తంగా డిజిటల్ కేబుల్ టీవీ సిగ్నల్స్ అందించగల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం
• స్థానిక కేబుల్ ఆపరేటర్ ను ఎమ్మెస్వో గా మార్చగలిగే ఒకే ఒక సాంకేతిక పరిజ్ఞానమిది. ఆపరేటర్ తన చందాదారుల వ్యవహారాలనూ, తన నెట్ వర్క్ నూ స్వతంత్రంగా నిర్వహించుకునే వీలుంటుంది.
• సిగ్నల్స్ అన్నీ నేరుగా ఉపగ్రహం ( శాటిలైట్ ) నుంచే వస్తాయి కాబట్టి సిగ్నల్ నాణ్యత ఎంతమాత్రమూ కోల్పోయే అవకాశముండదు
• అత్యుత్తమైన వీడియో, ఆడియో నాణ్యత
• స్థానిక కేబుల్ ఆపరేటర్ దగ్గర హిట్స్ డిజిటల్ హెడ్ ఎండ్ ఏర్పాటు చేయటానికీ, సాంకేతిక సహకారం అందించటానికీ WWIL సహకరిస్తుంది
• చందాదారుడు ఎంచుకోవటానికీ పూర్తి స్వేచ్ఛనిస్తూ WWIL రకరకాల ప్యాకేజీలు అందిస్తుంది. కనీస ప్యాకేజి రూ 60 + పన్నులు తో మొదలవుతుంది.
• చందాదారు యాజమాన్య వ్యవస్థ ( Subscriber Management System – SMS) ద్వారా చందాదారు వ్యవహారాలు చేపడుతుంది.
2. హిట్స్ లో భాగస్వామి కావాలనుకునే ఆపరేటర్ అర్హతలేంటి ?

జ: తాను కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న ప్రాంతంలో ఉన్న స్థానిక పోస్టాఫీసులో ఆపరేటర్ గా రిజిస్టర్
చేసుకొని ఉండాలి
• హిట్స్ ద్వారా ప్రసారాలు అందిస్తానంటూ WWIL తో ఆపరేటర్ ఒక ఒప్పందం మీద సంతకం చేయాలి
• హార్డ్ వేర్ నెలకొల్పటం, చానల్ ప్యాకేజీలు తయారుచేయటం, వియోగదారుల మంచిచెడ్డలు చూడటం లాంటి విషయాల్లో అడుగడుగునా WWIL సహాయం చేస్తూ ఉంటుంది.

3. హిట్స్ వ్యవస్థ ప్రారంభించటానికి అవసరమైన హార్డ్ వేర్ ఏంటి ?

జ: ఆపరేటర్ దగ్గర – శాటిలైట్ నుంచి నేరుగా సిగ్నల్స్ అందుకోవటానికి ఒక పూర్తిస్థాయి రిసీవింగ్
యూనిట్ కావాలి. ఇందులో ఉండేవి:
• రెండు సి బాండ్ ప్రొఫెషనల్ డిష్ యాంటెన్నాలు ( ఇప్పుడు వాడుతున్నవి సాంకేతికంగా సమర్థమైనవి అయిన పక్షంలో వాటినే వాడవచ్చు. )
• ఒక కె యు బాండ్ డిష్ యాంటెన్నా (120 CMS )
• 13 ట్రాన్స్ మాడ్యులేటర్ల సెట్ ఒకటి
• ఒక ర్యాక్. ( అప్పటికే 15 ర్యాక్ స్థలం ఉంటే అవసరం లేదు )
• యుపిఎస్ ( ఒకవేళ 1.5 కెవిఎ ఆఫ్ లైన్ కెపాసిటీ మిగిలి ఉంటే అవసరం లేదు )

చందాదారుని దగ్గర – డిజిటల్ సిగ్నల్స్ డీకోడ్ చేసుకోవటానికి
• డిజిటల్ సెట్ టాప్ బాక్స్

4. ఈ హార్డ్ వేర్ ఖరీదెంత ?

జ: పూర్తిస్థాయి హిట్స్ రిసీవింగ్ యూనిట్
• సుమారు 3 లక్షల యాభై వేలు ( నెలకొల్పటం, ప్రారంభించటం సహా )
• సెట్ టాప్ బాక్స్ : రెండు రకాల వ్యాపార నమూనాలు అందుబాటులో ఉన్నాయి
అద్దె పద్ధతి : యాక్టివేషన్ చార్జీలు : రూ. 499+ పన్నులు
13నుంచి 72వ నెల వరకు : రూ. 30+పన్నులు
పూర్తి కొనుగోలు : రూ. 2,000

5. స్థానిక కేబుల్ ఆపరేటర్ ఇప్పుడున్న నెట్ వర్క్ ను హిట్స్ లో కూడా వాడుకోవచ్చా?

జ: అవును. ఇప్పుడున్న కొయాక్సియల్ కేబుల్, యాంప్లిఫయర్లను ఈ టెక్నాలజీలోనూ వాడుకోవచ్చు.
సాంకేతికంగా సరిపడే పక్షంలో ఇప్పుడున్న డిష్ యాంటెన్నాలను, యుపిఎస్ ను, ఎర్తింగ్ ను కూడా
వాడుకోవచ్చు

6. స్థానిక కేబుల్ ఆపరేటర్ తన స్థానిక చానల్ కూడా కలుపుకోవచ్చా?

జ: అవును. కేబుల్ ఆపరేటర్ తన సొంత చానల్స్ ను డిజిటల్ విధానంలో కలుపుకోవచ్చు. అందుకోసం
అదనంగా కొంత హార్డ్ వేర్ అవసరమవుతుంది. ఆపరేటర్ సొంతగా కొనుక్కోవాల్సి వస్తుంది.

7. కేబుల్ ఆపరేటర్ ఇదే నెట్ వర్క్ మీద డిజిటల్ హిట్స్ ఫీడ్ తో బాటునలాగ్ ఫీడ్ కూడా ఇవ్వవచ్చునా?
జ: అవును. ఇవ్వవచ్చు

8. హిట్స్ డిజిటల్ ఫీడ్ కి వాడే ఫ్రీక్వెన్సీలు ఏమిటి ?

జ: కేబుల్ ఆపరేటర్ 300 నుంచి 860 MHz వరకు ఏ ఫ్రీక్వెన్సీ అయినా వాడుకోవచ్చు

9. హిట్స్ కు ఏయే బాండ్స్ వాడతారు ?

జ: హిట్స్ లో సిగ్నల్స్ ప్రసారానికి సి బాండ్, కెయు బాండ్ రెండూ వాడతారు

10. అనలాగ్, ఇతర డిజిటల్ కేబుల్ సర్వీస్, డిటిహెచ్ కంటే హిట్స్ ఎలా మెరుగైనది ?

అనలాగ్ డిజిటల్ డిటిహెచ్ హిట్స్
తక్కువ స్పెక్ట్రమ్ చాలా ఎక్కువ స్పెక్ట్రమ్ తక్కువ స్పెక్ట్రమ్, ఎక్కువ స్పెక్ట్రమ్,
106 కంటే తక్కువ చానల్స్ క్యారీయింగ్ ఖర్చు ఎక్కువ క్యారీయింగ్ ఖర్చు చాలా ఎక్కువ తక్కువ క్యారీయింగ్ ఖర్చు ఉంటుంది

నాణ్యత తక్కువ, దృశ్య నాణ్యత మెరుగు, దృశ్యనాణ్యత మెరుగ్గా ఉన్నా, ఎలాంటి అవాంతరాలూ లేని
అనవసర శబ్దాలు, అనలాగ్ చానల్ మిక్సింగ్ వాతావరణం సరిగా లేనప్పుడు ఉత్తమ నాణ్యత, వాతావరణ
చుక్కలు చుక్కలుగా దృశ్యం వల్ల అంతరాయాలు పనిచేయకపోవచ్చు ప్రభావం అసలే ఉండదు

పోటీ వల్ల తరచు కేబుల్ పోటీ వల్ల తరచు కేబుల్ చిన్న సాంకేతిక సమస్యతో అప్పటికప్పుడే స్థానికంగా మరమ్మతు
కత్తిరింపులు జరగవచ్చు కేబుల్ కత్తిరింపులు జరగవచ్చు ప్రసారాలు ఆగినా అవకాశం. డిష్ యాంటెన్నా
మరమ్మతుకు చాలా టైమ్ కావాలి ఇంటింటికీ అవసరం లేదు

చందా లో ఏకరూపత చందాలో ఏకరూపత ఉండదు పోల్చి చూసుకుంటే చందా దేశమంతటా ఒకే రకమైన
ఉండదు.రకరకాలుగా ఉంటుంది. రకరకాలుగా ఉంటుంది. చాలా ఎక్కువ. పైగా పరికరాల చందాధర, మరమ్మతుకు
వృత్తిపరమైన నైపుణ్యం తక్కువ మరమ్మతు పట్టణాలకే పరిమితం మీద హక్కు చందారుకు ఉండదు ఎక్కడికక్కడే స్థానికంగా ఏర్పాటు

బాండ్ విడ్త్ సమస్య వల్ల సాధ్యమే అయినా ఖర్చు అసలు సాధ్యం కాదు సాధ్యమే. కొద్ది మొత్తం అదనపు
అదనపు చానల్స్ జోడించటం చాలా ఎక్కువవుతుంది ఖర్చు ఉంటుంది.
కష్టమవుతుంది.
క్యారేజ్ ఫీజు వసూలు చేయరు.


Q. హిట్స్ లో వాయిస్ ఆన్ డిమాండ్ ( VOD ), గేమ్స్ లాంటి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ కి అవకాశముంటుందా?

జ: అవును. ఉంటుంది

Q. బిల్లింగ్ విధానం ఎలా ఉంటుంది ?

జ: ఇది ప్రీపెయిడ్ బిల్లింగ్ విధానం.
• ప్యాకేజ్ బేసిక్ ధర మీద సర్వీస్ ప్రొవైడర్ ఎలాంటి పన్నులూ కలపకుండా ఆపరేటర్ పేరుమీద ఇన్వాయిస్ తయారుచేసి పంపుతాడు. అయితే, ఇందులో 10.3% సర్వీస్ టాక్స్ కలిసి ఉంటుంది.
• కేబుల్ ఆపరేటర్ తన చందాదారులమీద అన్ని పన్నులతో ( సర్వీస్ టాక్స్, ఎంటర్టైన్మెంట్ టాక్స్) బాటు తన లాభం కూడా కలుపుకొని ఇన్వాయిస్ తయారుచేస్తాడు
• కేబుల్ ఆపరేటర్ తన చందాదారులనుంచి చందా మొత్తాలు వసూలు చేస్తాడు.