• Home »
  • Cable »
  • పే చానల్స్ చందాలమీద సమగ్ర ఆదేశాలివ్వాలి: ట్రాయ్ కి హోమ్ కేబుల్ లేఖ

పే చానల్స్ చందాలమీద సమగ్ర ఆదేశాలివ్వాలి: ట్రాయ్ కి హోమ్ కేబుల్ లేఖ

పే చానల్స్  టారిఫ్ విషయంలో సమగ్రమైన ఉత్తర్వులు జారీచేయాలంటూ ఢిల్లీ కి చెందిన్ ఎమ్మెస్వో హోమ్ కేబుల్ నెట్ వర్క్  ఈ రోజు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) కొత్త చైర్మన్ ఆర్ ఎస్ శర్మకు లేఖ రాసింది. గతంలో పే చానల్స్ చందా రేట్లు పెంచుకోవటానికి అనుమతించిన ట్రాయ్ మీద టిడిశాట్ లో సవాలు చేసి ఆ ఉత్తర్వులను రద్దు చేయించటంలో సుప్రీ కోర్టుకూ వెళ్ళిన వారిలో హోమ్ కేబుల్ ఉన్న సంగతి తెలిసిందే.

ట్రాయ్ ఉత్తర్వులను రద్దు చేస్తూ టిడిశాట్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో ఇప్పుడు టాయ్ కి హోమ్ కేబుల్  మేనేజింగ్ డైరెక్టర్  విక్కీ చౌధురి లేఖ రాశారు. సుప్రీంకోర్టు చెప్పిన విధంగా కొత్త టారిఫ్ మీద సమగ్రమైన ఉత్తర్వులు ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.ప్రేక్షకుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని, అదే సమయంలో పే చానల్ యజమానులు పంపిణీదారులకు ఇచ్చే ధరలో ఎలాంటి వివక్షా లేకుండా చూసినప్పుడే సమాన వ్యాపార అవకాశాలుంటాయని చౌధిరి పేర్కొన్నారు.

పే చానల్ యజమానులు తమ తమ చందారేట్లను స్పష్టంగా వెల్లడించేట్టు చూడాలని, సుప్రీంకోర్టు తీర్పుకు ముందు జులై 23 న ఇచ్చిన ఆదేసాల స్థానంలో కొత్త ఆదేసాలు జారీచేయాలని ట్రాయ్ కి విజ్ఞప్తిచేశారు. అదే సమయంలో ఆయా చానల్స్ ప్రకటనలకోసం వాడుకుంటున్న సమయాన్ని  కూడా తెలియజేసేలా చూడాలని కోరారు. గత మూడేళ్ళుగా పట్టిపీడిస్తున్న ఈ సమస్యలన్నిటికీ తెరదించేలా ట్రాయ్ చర్య  తీసుకోవాలని సూచించారు.