• Home »
  • BARC »
  • రేటింగ్స్ మీద స్పోర్ట్స్ చానల్స్ ప్రభావం : టాప్ 10 లో చోటు దక్కని తెలుగు చానల్స్

రేటింగ్స్ మీద స్పోర్ట్స్ చానల్స్ ప్రభావం : టాప్ 10 లో చోటు దక్కని తెలుగు చానల్స్

దేశవ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకాదరణ ఉన్న చానల్ గా సన్ టీవీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మార్చి 19-25 మధ్య వారానికి బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) అందించిన తాజా సమాచారం ప్రకారం సన్ టీవీ మొదటి స్థానంలో ఉండగా స్టార్ స్పోర్ట్స్ 3 రెండవ స్థానంలోను, స్టార్ ప్లస్ మూడో స్థానంలోను నిలిచాయి. స్టార్ స్పోర్ట్స్ 1 కి నాలుగో స్థానం  దక్కగా కలర్స్ కు ఐదో స్థానం లభించింది.

జీ టీవీ ఆరో స్థానంలోను, జీ అన్మోల్ ఏడో స్థానంలోను, డిడి నేషనల్ ఎనిమిదో స్థానంలోను. సోనీ పాల్ తొమ్మిదో స్థానంలోను, స్టార్ ఉత్సవ్ అప్దో స్థానంలోను ఉన్నాయి. ఈ సారి ఏ ఒక్క  తెలుగు చానల్ కూ టాప్ 10 లో చోటు దక్కలేదు. రెండు స్టార్ స్పోర్ట్స్ చానల్స్ తోబాటు అదే స్పోర్ట్స్ కారణంగా డిడి నేషనల్ కూడా టాప్ 10 జాబితాలోకి వచ్చి చేరటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.