• Home »
  • Cable »
  • కేబుల్ టీవీ డిజిటైజేషన్ మూడో దశ జాబితాలో మీ పట్టణం ఉందా?

కేబుల్ టీవీ డిజిటైజేషన్ మూడో దశ జాబితాలో మీ పట్టణం ఉందా?

కేబుల్ టీవీ డిజిటైజేషన్ మూడో దశ అమలు జరగటానికి ఇంకా రెండు నెలలే మిగిలి ఉండగా ప్రభుత్వం ఆ పట్టణాల జాబితాలో మార్పులు ప్రకటించింది రెండు తెలుగు రాష్టాలతో సహా ఏడు రాష్ట్రాల పట్టణాలలో ఈ మార్పులు జరిగాయి. దీంతో తాజా మార్పులలో తొలగింపుకు గురైన పట్టణాలు నాలుగో దశకిందికి వెళ్ళి డిజిటైజేషన్ కు మరో ఏడాది గడువు పెరుగుతుంది. అక్టోబర్ 16 న ప్రకటించిన జాబితాకు అదనంగా ఈ మార్పులు చేసినట్టు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెబ్ సైట్ తెలియజేసింది. ఆయా రాష్ట్రాలనుంచి నోడల అధికారులు పంపిన జాబితాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటన పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ లో మార్పులు, చేర్పులు :
శ్రీకాకుళం జిల్లా : సోంపేట, హీరమండలం, టెక్కలి, నరసన్నపేట, బలగ, పొందూరు తొలగించారు
విజయనగరం జిల్లా: గజపతినగరం, శ్రీరామ్ నగర్, చీపురుపల్లి, తుమ్మికపల్లె, కొత్తవలస, కనపాక, మలిచెర్ల, జర్జపుపేట, చింతల వలస తొలగించారు. నెల్లిమర్ల ను అప్ గ్రేడ్ చేశారు.
విశాఖపట్టణం జిల్లా: ఎలమంచిలి, నర్సీపట్నం కలిపారు
తూర్పు గోదావరి జిల్లా : ఆరెంపూడి, రంపచోదవరం, కత్తేరు, మోరంపూడి, హుకుంపేట, ధవళేశ్వరం, రమణయ్యపేట, సూర్యారావుపేట, చిడిగ, బండారులంక తొలగించారు. ముమ్మిడివరం, గొల్లప్రోలు, ఏలేశ్వరం కలిపారు
పశ్చిమ గోదావరి జిల్లా : ద్వారకాతిరుమల, శనివారపు పేట, సత్రంపాడు, గవరవరం, తంగెళ్ళమూడి తొలగించారు. జంగారెడ్డిగూడెం కలిపారు.
కృష్ణా జిల్లా : నడిం తిరువూరు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, రామవరప్పాడు, ప్రసాదంపాడు, కంకిపాడు, కానూరు, పోరంకి, తాడిగడప, యనమలకుదురు తొలగించారు. నందిగామ, తిరువూరు, ఉయ్యూరు కలిపారు.
గుంటూరు జిల్లా: వడ్డేశ్వరం తొలగించారు.
ప్రకాశం జిల్లా: కంభం, పొదిలి, చీరాల, వేటపాలెం, పామూరు, మూలగుంటపాడు, సింగరాయకొండ తొలగించారు. గిద్దలూరు, కనిగిరి అప్ గ్రేడ్ చేశారు. చీమకుర్తి, అద్దంకి కలిపారు.
నెల్లూరు జిల్లా : బుజబుజ నెల్లూరు, విన్నమాల, ఎల్ ఎ సాగరం, తడ కండ్రిగ తొలగించారు. సూళ్ళూరుపేటను అప్ గ్రేడ్ చేశారు. ఆత్మకూరు, నాయుడుపేట కలిపారు.
కడప జిల్లా : వేపరాల, దొమ్మర నంద్యాల, గోపవరం, మోదమీదిపల్లె, రామేశ్వరం, మోరగుడి, ముద్దనూరు, చెన్నముక్కపల్లె, నాగిరెడ్డిపల్లె మంగంపేట తొలగించారు. యెర్రగుంట్ల ను అప్ గ్రేడ్ చేశారు. మైదుకూరు కలిపారు.
కర్నూలు జిల్లా: మామిడాలపాడు, శ్రీశైలం ప్రాజెక్ట్ టౌన్ షిప్, బేతం చెర్ల, బనగానపల్లె, బానుముక్కల, రామాపురం తొలగించారు. గూడూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్ళగడ్డ కలిపారు.
అనంతపురం జిల్లా : ఉరవకొండ, నారాయణపురం, పాపంపేట, అనంతపురం, కక్కలపల్లె , యెనుమలపల్లె, సోమందేపల్లె తొలగించారు. గుత్తి, కల్యాణ దుర్గం అప్ గ్రేడ్ అయ్యాయి. పుట్టపర్తి, మడకశిర, పామిడి కలిపారు.
చిత్తూరు జిల్లా : చెర్లోపల్లె, పేరూరు, అవిలాల, తిరుచానూరు, రేణిగుంట, తిరుమల, తిరుపతి రూరల్, అక్కరం పల్లె, మంగళం, పీలేరు, నారాయణవనం, మంగసముద్రం, మురకంబట్టు, కుప్పం తొలగించారు.
తెలంగాణ రాష్ట్రంలో మార్పులు, చేర్పులు:
ఆదిలాబాద్ జిల్లా : దస్నాపూర్, అసిఫాబాద్, జైనూర్, ఉట్నూర్, ఇచ్చోడ, తిమ్మాపూర్, దేవపూర్, కాశిపేట, క్యాతంపల్లె, లక్సెట్టిపేట, తీగలపహాడ్, నస్పూర్, తాళ్ళపల్లె, సింగాపూర్, చెన్నూర్ తొలగించారు.
నిజామాబాద్ జిల్లా: సోన్ పేట్, ఘన్ పూర్, బాన్స్ వాడ, ఎల్లారెడ్డి తొలగించారు.
కరీంనగర్ జిల్లా : పాలకుర్తి, జల్లారం,రత్నాపూర్, రేకుర్తి, ధర్మారం తొలగించారు. పెద్దపల్లి, వేములవాడ అప్ గ్రేడ్ అయ్యాయి. హుస్నాబాద్, జమ్మికుంట కలిపారు.
మెదక్ జిల్లా : నారాయణఖేడ్, శంకరం పేట్, సిద్దిపేట్, నర్సాపూర్, చేగుంట, అల్లిపూర్, పోతిరెడ్డిపల్లె, ఎద్దుమైలారం, బొంతపల్లె, అన్నారం, బొల్లారమ్, చిట్కుల్, ఇస్నాపూర్, ముత్తంగి, అమీన్ పూర్, భానూర్ తొలగించారు. జోగిపేట, గజ్వేల్ అప్ గ్రేడ్ అయ్యాయి. దుబ్బాక కలిపారు.
రంగారెడ్డి జిల్లా : దుండిగల్, బాచుపల్లి, కొంపల్లె, జవహర్ నగర్, నాగారం, ఘట్ కేసర్, బోడుప్పల్, మేడిపల్లి, పీర్జాదిగూడ, తుర్కయాంజాల్, ఒమెర్ ఖాన్ గూడ, జిల్లలగూడ, మీర్ పేట్, కొత్తపేట్,నార్సింగి, బండ్లగూడ, కిస్మత్ పూర్, శంషాబాద్ తొలగించారు. మేడ్చెల్, బడంగ్ పేట్ అప్ గ్రేడ్ అయ్యాయి. పెద్ద అంబర్ పేట్, శంషాబాద్ విమానాశ్రయం కలిపారు.
మహబూబ్ నగర్ జిల్లా: ఫరూక్ నగర్, కొత్తూర్, జడ్చెర్ల, బోయపల్లె, ఎనుగొండ, వటవర్లపల్లి, తంగాపూర్, చిన్న చింతకుంట, ఆత్మకూరు, కొత్తకోట తొలగించారు. బడేపల్లె, అచ్చంపేట, నాగర్ కర్నూల్ అప్ గ్రేడ్ అయ్యాయి. కొల్లాపూర్, లీజ, షాద్ నగర్ కలిశాయి.
నల్గొండ జిల్లా : రఘునాథపూర్, యాదగిరిగుట్ట, బీబీనగర్, పోచంపల్లి, చౌటుప్పల్, రామన్నపేట, చిట్యాల, నక్రేకల్, కొండమల్లేపల్లి తొలగించారు. దేవరకొండ, కోదాడ అప్ గ్రేడ్ అయ్యాయి. హుజూరాబాద్, హుజూర్ నగర్ కలిశాయి.
వరంగల్ జిల్లా: స్టేషన్ ఘనపూర్, శివునిపల్లె, భీమారం, కమలాపురం, ఎనుమాముల, కడిపికొండ, మామనూరు, గొర్రెకుంట, డోర్నకల్ తొలగించారు. భూపాలపల్లె, నర్సంపేట, మహబూబాబాద్ అప్ గ్రేడ్ అయ్యాయి. పరకాల కలిపారు.
ఖమ్మం జిల్లా : భద్రాచలం, సారపాక, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లె, గరిమెళ్ళపాడు, బల్లేపల్లె, ఖానాపురం హవేలి తొలగించారు. మధిర అప్ గ్రేడ్ అయింది.