టీవీ చానల్స్ కు ’జియో’ భయం

జియోసేవలు మొదలైనప్పటినుంచి కేవలం ఉచిత ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్, 1 జిబి డేటాకు మాత్రమే పరిమితం కాకుండా 550 కి పైగా చానల్స్ ఇచ్చే సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే మొబైల్ ఫోన్లలో లైవ్ స్ట్రీమింగ్ చూసే వెసులుబాటు ఏర్పడింది. జియో మొబైల్ ప్లాన్ నెలకు రూ.125 లోపే ఉండటంతో అది కేబుల్ టీవీకి, డిటిహెచ్ కి సైతం పెనుసవాలుగా తయారవుతుందనే భయాలు చుట్టుముట్టాయి. జియోఫోన్ నుంచి టీవీలు అనుసంధానించే అవకాశం రావటంతో భయాల తీవ్రత మరింత పెరిగింది.

మరి నాణ్యత అంతంతమాత్రంగానే ఉంటుంది కదా అనే వాళ్ళున్నారు. కానీహెచ్ డి చానల్స్ సైతం 40 అంగుళాల టీవీ సెట్ లో చూసినప్పుడు నాణ్యతకాస్త తక్కువగా అనిపించటం సహజం. కానీ ముందు ముందు నాణ్యత విషయంలోనూ రిలయెన్స్ తగిన చర్యలు తీసుకోవచ్చు. హక్కుల కోసంటీవీ చానల్స్ కు జియో చెల్లించి ఉంటుందా అనే అనుమానం రావచ్చుగాని ఒటిటి వేదికలన్నిటి తరహాలో జియో కూడా చెల్లించే ఉంటుంది. కానీ అందరికీ అందుబాటులోకి రాగల అవకాశం జియోకే ఉంది.

ఈ మధ్య జీ, జియో సమావేశంలో జీ అధికారులు ఇచ్చిన వివరణను బట్టి చూస్తే జీ ప్రసారాలు జియో కి ఇచ్చేముందే కేవలం సిమ్ ద్వారా ఇవ్వాలని కోరారు. అదే కేబుల్ టీవీ ద్వారా ఇవ్వాలంటే చానల్స్ ఎక్కువ ధరలు వసూలు చేస్తాయని సూచనప్రాయంగా చెప్పినట్టయింది. అయితే, ఒప్పందంలో ఎలా ఉందనేది మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకమే.

జియో టెక్నాలజీని ఊహించకుండా ఒప్పందం చేసుకొని ఉంటారనే అభిప్రాయం కూడా ఉంది. నిజానికి సిమ్ కార్డ్ ఉపయోగించుకునే ఏ పరికరాన్నైనా వాడుకోగలిగే వీలుండే పక్షంలోక్రోమ్ కాస్ట్ తరహా డాంగిల్ వాడితే చానల్స్ చేయగలిగేదేమీ ఉండదు. అప్పుడు జియీ యధేచ్ఛగా కేబుల్ టీవీ కనెక్షన్లు ఇవ్వవచ్చు.

అందుకే ఇప్పుడు జియో టీవీ ఏం చేయబోతున్నదనేది ఒక పెద్ద ప్రశ్నగా అందరి ముందూ నిలిచింది. ఇప్పటికే ఎమ్మెస్వో లైసెన్స్ కూడా తీసుకొని ఉండటం ఈ భయాలకు మరింత ఊతమిస్తోంది. జియో తన లైవ్ స్ట్రీమింగ్ సేవలు ప్రారంభించిందంటే ఒక్కసారిగా కేబుల్, డిటిహెచ్ రంగాలు కంగుతింటాయి. అందుకే పెద్ద ఎత్తున కలవరం మొదలైంది.