• Home »
  • Cable TV »
  • 536 కు చేరిన జియో టీవీ చానల్స్

536 కు చేరిన జియో టీవీ చానల్స్

రిలయెన్స్ జియో వారి ఒటిటి వేదిక జియో టీవీలో తాజాగా మరో 10 చానల్స్ చేరటంతో మొత్తం చానల్స్ సంఖ్య జనవరి 4 నాటికి 536 కు చేరుకుంది. వీటిలో 172 హిందీ చానల్స్ , 77 ఇంగ్లీష్ చానల్స్ ఉండగా మూడో అతిపెద్ద భాషా సమూహంగా 59 చానల్స్ లో తెలుగు మూడో స్థానంలో ఉంది. మొత్తం చానల్స్ లో 104 హెచ్ డి చానల్స్ ఉండగా అందులో 8 తెలుగు హెచ్ డి చానల్స్ ఉన్నాయి.

ప్రసారాల వర్గీకరణ ఆధారంగా చూస్తే 189 న్యూస్ చానల్స్ కాగా 111 జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్, 48 ఆధ్యాత్మికం, 45 మూవీస్, 40 మ్యూజిక్ చానల్స్ ఉన్నాయి. ఇన్ఫొటైన్మెంట్ 34,  కిడ్స్ చానల్స్ 26,  స్పోర్ట్స్ 21, బిజినెస్ న్యూస్ 8 చానల్స్ ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్ లో పది కోట్లకు మించి డౌన్ లోడ్స్ నమోదవటం జియీ టీవీకున్న  ప్రేక్షకాదరణకు ఉదాహరణగా నిలిచింది.