• Home »
  • Cable »
  • కేబుల్ టీవీ చట్టం అమలు బాధ్యతలు జాయింట్ కలెక్టర్లకు అప్పగింత

కేబుల్ టీవీ చట్టం అమలు బాధ్యతలు జాయింట్ కలెక్టర్లకు అప్పగింత

డిజిటైజేషన్ అమలు చాలా కీలకమైన దశకు చేరుకున్న తరుణంలో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్స్ ( రెగ్యులేషన్ ) చట్టం, 1995 లోని నియమాలు అమలు చేసే అధికారాన్ని జాయింట్ కలెక్టర్లకు అప్పగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇప్పటివరకు జిల్లా కలెక్టర్లకు, పోలీస్ కమిషనర్ కు,  రెవెన్యూ డివిజనల్ అధికారులకు మాత్రమే ఈ అధికారాలు అప్పగించిన ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, చట్టంలోని సెక్షన్ 5,6 కింద చర్యలు తీసుకునే అధికారం మాత్రం కేంద్రం తన పరిధిలోనే ఉంచుకుంది. అంటే ప్రసారాలు, ప్రకటనలమీద అభ్యంతరాలమీద చర్యలు తీసుకునే హక్కు పోలీస్ కమిషనర్ , కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలకు ఉండదు.