• Home »
  • Entertainment »
  • బ్రాండ్ ఎండార్స్ మెంట్ కు కమల్ ఓకే : తొలి టీవీ ప్రకటన పోతీస్

బ్రాండ్ ఎండార్స్ మెంట్ కు కమల్ ఓకే : తొలి టీవీ ప్రకటన పోతీస్

దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రకటనలకు దూరంగా ఉంటూ వచ్చిన కమల్ హాసన్ ఇప్పుడు ఎట్టకేలకు టీవీ ప్రకటనకు ఒప్పుకున్నారు. ప్రజాప్రయోజనం కోసం ఉద్దేశించిన రెండు మూడు ప్రకటనలలో మినహా ఎక్కడా కనిపించని కమల్ హాసన్ వచ్చే దీపావళి కోసం చెన్నై లో పేరుమోసిన బట్టల దుకాణం పోతీస్ కోసం ప్రచార ప్రకటనకు సిద్ధమయ్యారు.

ఆయనను ఒప్పించటానికి రెండేళ్ళుగా ప్రయత్నిస్తూ వచ్చామని. ఇప్పుడు ఒప్పుకొని మొత్తం పోతీస్ బ్రాండ్ ని ఎండార్స్ చేయబోతున్నారని పోతీస్ ఎండీ ఎస్. రమేశ్ చెబుతున్నారు. అయితే, ఎంత పారితోషికం ఇస్తున్నదీ మాత్రం వెల్లడించలేదు. చాలా భారీ మొత్తంలో ఇచ్చి ఉంటారని మాత్రం మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి

నటుడు కృష్ణకుమార్ రామ్ కుమార్ ఈ ప్రకటనలకు దర్శకత్వం వహిస్తున్నారు. చెన్నైశివార్లలోని ఒక రిసార్ట్ లో బుధవారం నాడు షూటింగ్ జరిగింది. దీపావళి సందర్భంగా తమిళనాట పెద్ద్ ఎత్తున వ్యాపారం జరుగుతుంది గనుక ఈ ప్రకటన కూడా ప్రత్యేకంగా దీపావళి అమ్మకాలకోసం ఉద్దేశించినదేనని భావిస్తున్నారు.