• Home »
  • Entertainment »
  • సోనీతో చేతులు కలిపిన కపిల్ శర్మ: మే నుంచి సరికొత్త కామెడీ షో

సోనీతో చేతులు కలిపిన కపిల్ శర్మ: మే నుంచి సరికొత్త కామెడీ షో

కలర్స్ నుంచి వైదొలగిన కపిల్ శర్మ సోనీ ఎంటర్టైన్మెంట్ చానల్ తో చేతులు కలిపాడు. కొంతకాలంగా ఈ మాట ప్రచారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ విషయాన్ని సోనీ ధ్రువీకరించింది. ఈ వారాంతపు కామెడీ షో మే నెలలో ప్రారంభమయ్యే అవకాశాలున్నట్టి సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా సీఈవో ఎన్ పి సింగ్ వెల్లడించారు.

కపిల్ శర్మ సొంత సంస్థ కె9 తోబాటు ఫ్రేమ్స్ ప్రొడక్షన్స్ ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని రూపొందించబోతున్నాయి. నిజానికి కలర్స్ లో చేరకముందు కపిల్ శర్మ సోనీ సంస్థలోనే ఆరు సీజన్లపాటు కామెడీ సర్కస్ కార్యక్రమం అత్యంత విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.