• Home »
  • News »
  • కేరళ జైహింద్ టీవీ ఇక కాంగ్రెస్ పార్టీ చానల్

కేరళ జైహింద్ టీవీ ఇక కాంగ్రెస్ పార్టీ చానల్

న్యూస్ చానల్ ద్వారా సామాన్య ప్రజలకు చేరువ కావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే ప్రస్తుతం కేరళలో నడుస్తున్న జై హింద్ చానల్ ను జాతీయ ఆంగ్ల చానల్ గా మార్చాలని ఆలోచిస్తున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి అయిన ఎకె ఆంటొనీ చెప్పారు. దీనిమీద చర్చలు ముందుకు సాగుతున్నా యన్నారు.  ఎనిమిదేళ్ళుగా కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ చానల్ ను విజయవంతంగా నడిపిస్తోందని వ్యాఖ్యానించారు. సమగ్రంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారుచేసే బాధ్యతను ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి, కేరళ పిసిసి అధ్యక్షుడు రమేశ్ చెన్నితల కు అప్పగించారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పనులు వేగవంతం చేస్తున్నారు. నిజానికి గత ఎన్నికలలో యుపిఏ ప్రభుత్వం ఓడిపోవటానికి కారణం తగిన ప్రచారం చేసుకోకపోవటమేనని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్న సమయంలో ఈ చానల్ ఆలోచన కార్యరూపం ధరిస్తోంది.  సమగ్రమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీపనిలో ఉన్నామని జైహింద్ మేనేజింగ్ డైరెక్టర్, సీనియల్ కాంగ్రెస్ నాయకుడు అయిన ఎమ్ ఎమ్ హసన్ చెబుతున్నారు. దుష్ప్రచారాన్ని అడ్దుకోవటంలో కూడా విఫలం కావటం వల్లనే ఓటమి పాలయ్యామని ఊరూరా చెప్పుకుంటున్నామన్నారు.