• Home »
  • Cable »
  • కర్నూలు సీమ కమ్యూనికేషన్స్ కు తాళం: ఎంపీ టిజి వెంకటేశ్ ఫిర్యాదుకు స్పందన

కర్నూలు సీమ కమ్యూనికేషన్స్ కు తాళం: ఎంపీ టిజి వెంకటేశ్ ఫిర్యాదుకు స్పందన

పీస్ టీవీ సహా అనుమతి లేని చానల్స్ ప్రసారాలమీద కఠిన వైఖరి అవలంబిస్తున్నట్టు ప్రకటించుకున్న సమాచార ప్రసార మంత్రిత్వశాఖ అందుకు అనుగుణంగా చర్యలు తీవ్రతరం చేసింది. కర్నూలు, ఔరంగాబాద్ ఆపరేటర్లమీద అందిన ఫిర్యాదులను ఆయ జిల్లా అధికారులకు పంపినట్టు మంత్రి వెంకయ్య నాయుడు చెప్పిన 24 గంటలకే సహాయమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ రోజు లోక్ సభకు  తెలియజేస్తూ కర్నూలు ఆపరేటర్ కార్యాలయ్యాన్ని మూసివేసి పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

స్వయంగా కేబుల్ వ్యాపారం నిర్వహించిన అనుభవమున్న మాజీ మంత్రి , ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్ ఈ నెల 9న సీమ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద ఫిర్యాదు చేశారు. డౌన్ లింకింగ్ అనుమతి లేని పీస్ టీవీ ప్రసారాలు అందజేస్తున్నట్టు ఆయన చేసిన ఫిర్యాదును మంత్రిత్వశాఖ ఆ మరుసటి రోజే 10 న) కర్నూలు జిల్లా కలెక్టర్ కు పంపింది. దీంతో జిల్లా కలెక్టర్ ప్రాథమిక విచారణ అనంతరం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయించారు.

ఆ క్రమంలో కేబుల్ టీవీ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా అధికారులు  సీమ కమ్యూనికేషన్స్ కార్యాలయానికి సీలు వేయటంతోబాటు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.