• Home »
  • Cable »
  • డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ దరఖాస్తుకు గడువు తేదీ ఏప్రిల్ 30

డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ దరఖాస్తుకు గడువు తేదీ ఏప్రిల్ 30

ఆఖరిదైన నాలుగో దశ డిజిటైజేషన్ కు ఈ ఏడాది డిసెంబర్ 31 తో గడువు పూర్తవుతుండగాఏప్రిల్ 30 లోగా డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దరఖాస్తులు పరిశీలించి లైసెన్స్ మంజూరుచేయటానికి సమయం పడుతుంది కాబట్టే ఏప్రిల్ 30 ని గడువుగా నిర్ణయించినట్టు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.

లైసెన్ స్వచ్చిన తరువాత సెట్ టాప్ బాక్సులు సమకూర్చుకోవటం, డిజిటల్ హెడ్ ఎండ్ ఏర్పాటుచేసుకోవటం లాంటి పనులు ఉంటాయి కాబట్టి అప్పటికే లైసెన్స్ చేతిలో ఉంటే ఆఖరి నిమిషంలో హడావిడి ఉండదనేది ప్రభుత్వం అభిప్రాయం. అత్యంత కీలకమైన నాలుగోదశలో ఇంటర్ కనెక్షన్ ఒప్పందాలు కూడా త్వరగా పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

డిజితైజేషన్ నిబంధనల ప్రకారం ఎమ్మెస్వో గాని కేబుల్ ఆపరేటర్ గాని డిజిటల్ ఎమ్మెస్వోగా మారాలనుకుంటే లైసెన్స్ తీసుకోవటం తప్పనిసరి. పదేళ్ళ పాటు అమలులో ఉండే ఈ లైసెన్స్ దరఖాస్తు పరిశీలనకోసం రూ. లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాలు కావాల్సినవాళ్ళు హెల్ప్ లైన్ నెంబర్ 18001804343 కు ఫోన్ చేయవచ్చు.

దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే ఇదే వెబ్ సైట్ లో వ్యాసం చదవండి:

 

డిజిటల్ ఎమ్మెస్వోగా రిజిస్టర్ చేసుకోవటం ఎలా ?
http://telugutv.info/how-to-register-as-digital-mso/