• Home »
  • Cable »
  • ఆపరేటర్లు కూడా డిజిటల్ ఎమ్మెస్వోలు కావచ్చు

ఆపరేటర్లు కూడా డిజిటల్ ఎమ్మెస్వోలు కావచ్చు

పోస్టాఫీసులో ఆపరేటర్ గా రిజిస్టర్ చేసుకున్న ఆపరేటర్లు సైతం డిజిటైజేషన్ క్రమంలో ఎమ్మెస్వో కావటానికి అవకాశముందని సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. డిజిటైజేషన్ నిబంధనల ప్రకారం ఎమ్మెస్వోగా దరఖాస్తు చేసుకోవటానికి మిగిలిన అర్హతలన్నీ ఉన్నప్పుడు ప్రస్తుతం ఎమ్మెస్వో అయినా, కాకపోయినా డిజిటల్ ఎమ్మెస్వోగ దరఖాస్తు చేసుకోవటానికి అర్హులవుతారని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

అదే విధంగా గతంలో దరఖాస్తు చేసుకోని వారు సైతం ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించింది. వీలైనంత ఎక్కువమందిని డిజిటైజేషన్ ప్రక్రియలో భాగస్వాములను చేసి గడువులోగా పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కూడా పేర్కొంది. అదే విధంగా దరఖాస్తు సక్రమంగా నింపి పంపగలిగితే ఎలాంటి మధ్యవర్తులనూ ఆశ్రయించాల్సిన పనే లేదని కూడా ప్రభుత్వం ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. హోం మంత్రిత్వశాఖనుంచి క్లియరెన్స్  వచ్చే వరకూ ఆగదలచుకోని వారు ఒక అఫిడవిట్ ఇవ్వటం ద్వార వెంటనే తాత్కాలిక లైసెన్స్ పొందే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది.

హిట్స్ లాంటి ప్లాట్ ఫామ్ ను ఎంచుకొని తమ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోదలుచుకున్న చిన్న ఎమ్మెస్వోలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. హోం మంత్రిత్వశాఖ క్లియరెన్స్ ఇవ్వని పక్షంలో ఆ తాత్కాలిక లైసెన్స్ రద్దవుతుంది. నేరచరిత్ర ఉన్నవారు, ఆర్థిక నేరాలకు పాల్పడినవారు డైరెక్టర్లుగా ఉన్న పక్షంలో హోం శాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవచ్చు.

డిజిటల్ ఎమ్మెస్వోగా దరఖాస్తు చేసుకోవటమెలాగో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి :

http://telugutv.info/how-to-register-as-digital-mso/