• Home »
  • MIB/Licencing »
  • ’గ్యాన యోగి’ లైసెన్స్ గడువు పూర్తి, త్వరలో జీ తెలుగు, జెమిని న్యూస్

’గ్యాన యోగి’ లైసెన్స్ గడువు పూర్తి, త్వరలో జీ తెలుగు, జెమిని న్యూస్

తెలుగు ఆధ్యాత్మిక చానల్ గ్యాన యోగి లైసెన్స్ గడువు పూర్తయింది. బృందావన్ టెలివిజన్ నెట్ వర్క్ లిమిటెడ్ తీసుకున్న లైసెన్స్ గడువు ఈ మార్చి 1 తో పూర్తయింది.  బృందావన్ పేరుతో లైసెన్స్ పొందిన ఈ చానల్ ఈ మధ్యనే గ్యాన యోగి పేరుతో తెలుగులో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. మళ్ళీ పదేళ్ళపాటు అమలులో ఉండాలంటే రెన్యూ చేయించుకోవాలి. గ్యాన యోగితోబాటు మొత్తం 7 చానల్స్ కు లైసెన్స్ గడువు పూర్తయింది.

పదేళ్ళ శాటిలైట్ లైసెన్స్ గడువు పూర్తయిన చానల్స్ తమ వివరాలు అందజేసి రెన్యూ చేయించుకోవాలని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆదేశించింది. కొన్ని చానల్స్ ఇప్పటికే గడువు పూర్తికాగా మరికొన్ని చానల్స్ కు ఈ ఏడాది చివరిలోగా లైసెన్సు వ్యవధి పూర్తవుతుంది. అలాంటి 36 చానల్స్ జాబితాను ఈ రోజు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ఇప్పటికే లైసెన్స్ గడువు పూర్తయిన చానల్స్ లో గ్యాన యోగితోబాటు ఇమయం టీవీ, స్వర సాగర్, కెబిసి న్యూస్, మక్కళ్ టీవీ, మళవిల్ మనోరమ, మనోరమ న్యూస్ నార్త్, మనోరమ న్యూస్ సెంట్రల్ , కోల్ కతా టీవీ, 24 ఘంట ఉన్నాయి. అతి త్వరలోనే లైసెన్స్ పూర్తి కాబోతున్న చానల్స్ జాబితాలో జీ తెలుగు, జెమిని న్యూస్, జెమిని మ్యూజిక్ ఉన్నాయి.