• Home »
  • Entertainment »
  • డిడి సహ్యాద్రిలో కుంభమేళా ప్రత్యక్షప్రసారం

డిడి సహ్యాద్రిలో కుంభమేళా ప్రత్యక్షప్రసారం

ఈ నెల 29 నుంచి జరిగే సింహస్థ కుంభమేళాను నాసిక్ నుంచి త్రయంబకేశ్వరం నుంచి డిడి సహ్యాద్రి ప్రత్యక్షప్రసారం చేస్తుంది. ప్రత్యేకంగా డిడి సహ్యాద్రి మాత్రమే ప్రత్యక్షప్రసారం చేస్తుందని దూరదర్శన్ ప్రకటించింది. ఈ ఘట్టం చిత్రీకరణకు మొత్తం 27 కెమెరాలు వాడుతుండగా 16 నాసిక్ లోను, 11 త్రయంబకేశ్వరంలోను ఏర్పాటు చేస్తున్నారు. 110 మంది సిబ్బందిని దూరదర్శన్ ప్రత్యేకంగా విధులకు పంపుతోంది. మిగతా చానల్స్ కూడా వాడుకోవటానికి వీలుగా లోగో లేకుండా అందించేందుకు కూడా అవకాశం కల్పిస్తోంది.

నాసిక్ నుంచి ఈ నెల 29, వచ్చే నెల13,18 తేదీల్లోనూ,  త్రయంబకేశ్వరం నుంచి ఈ నెల 29, వచ్చే నెల 13,14,25 తేదీల్లోనూ ఉదయం 5.30 నుంచిసాయంత్రం 6.00 వరకూఈ ప్రత్యక్ష ప్రసారాలుంటాయి. కుంభమేళా మీద శాస్త్రీయ అంశాలతో సహా అన్ని కోణాల్లో  నిపుణుల విశ్లేషణలు, ప్రార్థనలమీద, సంప్రదాయ పూజా విధానాలమీద అవగాహనకు సంబంధించిన కార్యక్రమలు కూడా ప్రసారం చేస్తారు.