• Home »
  • MIB/Licencing »
  • ఎఫ్ ఎం వేలానికి తెలుగునాట స్పందన కరవు

ఎఫ్ ఎం వేలానికి తెలుగునాట స్పందన కరవు

ఇరవై రోజుల పాటు వేలం జరిగినా తిరుపతి, వరంగల్, రాజమండ్రి, విజయవాడ నగరాలలో కొత్తగా ఎఫ్ ఎం రేడియో స్టేషన్లు తీసుకోవటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ నగరాలలో ఇప్పటికే ఉన్న ఎఫ్ ఎం రేడియో స్టేషన్లు అంతంత మాత్రంగానే నడుస్తూ ఉండటం అందుకు కారణమని భావిస్తున్నారు.

రోజుకు నాలుగు రౌండ్ల చొప్పున ఇప్పటివరకూ మొత్తం 80 రౌండ్లు పూర్తయ్యాయి. ప్రధాన నగరాలలో పెద్దమొత్తాలకు సిద్ధపడటంతో ప్రభుత్వం ఆశించిన దానికి రెట్టింపు ఆదాయం ఇప్పటికే వచ్చింది. కానీ చిన్న పట్టణాల విషయంలోనే పెద్దగా ఆసక్తి కనబడటం లేదు.

ఇప్పటివరకు 56 నగరాలలో 94 రేడియో చానల్స్ వేలం దాదాపుగా పూర్తయింది. వీటి వేలం విలువ రూ.1130 కోట్ల 51 లక్షలు. అన్ని రేడియో చానల్స్ కు కలిపి ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వ్ ధర రూ. 459 కోట్లు.