• Home »
  • BARC »
  • తెలుగు చానల్స్ లో నెం.1 మా టీవీ: ఆదుకున్న బాహుబలి

తెలుగు చానల్స్ లో నెం.1 మా టీవీ: ఆదుకున్న బాహుబలి

తెలుగు చానల్స్ తాజా రేటింగ్స్ లో మా టీవీ నెంబర్ వన్ స్థానం సంపాదించుకుంది. అక్టోబర్ 24-30 మధ్య వారానికి బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) అందజేసిన సమాచారం ప్రకారం మా టీవీ రేటింగ్స్ గణనీయంగా పెరిగి తెలుగులో నెంబర్ వన్ కావటంతోబాటు జాతీయ స్థాయిలో ఏదో స్థానం దక్కించుకుంది. ఇంత రాంక్ తెచ్చుకున్న తొలి తెలుగు చానల్ గా కూడా నమోదైంది. ఈ టీవీకి రెండో రాంక్ రాగా జీ తెలుగు మూడో స్థానానికి పడిపోయింది. కొద్దిపాటి తేడాతో జెమినీ టీవీ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

ఇలా ఉండగా, మా టీవీ అకస్మాత్తుగా మళ్ళీ తన నెంబర్ వన్ స్థానంలోకి దూసుకురావటానికి ప్రధానకారణం తాజా రేటింగ్స్ లెక్కింపు మొదలైన అక్టోబర్ 24 నాడు ప్రసారమైన బాహుబలి చిత్రానికి లభించిన ఆదరణేనని బార్క్ లెక్కలు చెబుతున్నాయి. ఆ వారం ప్రసారమైన టాప్ 5 కార్యక్రమాల్లో మొదటి స్థానం సంపాదించుకోవటమే కాకుండా ఆ తరువాత రెండు రాంకుల్లో ఉన్న కార్యక్రమాల మొత్తం రేటింగ్స్ కంటే ఎక్కువ సంపాదించుకోగలిగింది.

మా టీవీ బాహుబలి కి 14,991 లభించగా, జెమిని టీవీ గంగ 6987 సంపాదించుకుంది. ఆ తరువాత మూడు స్థానాల్లోనూ ఈటీవీ సీరియల్స్ మనసు మమత (6218), స్వాతి చినుకులు ( 6216), నా పేరు మీనాక్షి ( 5014) ఉన్నాయి. అందుకే వచ్చే వారం ఎలా ఉండబోతున్నదనే ఉత్కంఠ కొనసాగుతోంది.