• Home »
  • BARC »
  • 33 వ వారంలో రాంకులు తారుమారు; నెం.1 మా టీవీ, నాలుగో స్థానంలో ఈటీవీ

33 వ వారంలో రాంకులు తారుమారు; నెం.1 మా టీవీ, నాలుగో స్థానంలో ఈటీవీ

బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) ఇచ్చిన 33వ వారం రేటింగ్స్ లో తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్ రాంకులు తారుమారయ్యాయి. మా టీవీ మళ్ళీ చాలా కాలం తరువాత నెంబర్ వన్ స్థానంలోకి రాగా జీ తెలుగు రెండో స్థానానికి పరిమితమైంది. అదే విధంగా జెమిని టీవీ మూడో స్థానంలోకి ఎగబాకటంతో ఈటీవీ తిరిగి నాలుగో స్థానానికే వెళ్ళాలసి వచ్చింది.

33 వ వారానికి గాను మా టీవీకి 132859 జివిటి లు రావటంతో మొదటి స్థానం దక్కించుకుంది. జీ తెలుగు కు     125082 జివిటి లు రావటంతో రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఈటీవీని మించిపోయి జెమిని టీవీ 105533 జివిటిలు తెచ్చుకోవటంలో మూడో స్థానంలో ఉంది. దీంతో ఈటీవీ తిరిగి నాలుగో స్థానానికే వెళ్ళిపోయింది.