• Home »
  • Entertainment »
  • టామ్ రేటింగ్స్ ౩౩వ వారంలో నెం.1 మా టీవీ

టామ్ రేటింగ్స్ ౩౩వ వారంలో నెం.1 మా టీవీ

TAM 33

ఆగస్టు 15 తో ముగిసిన 33 వ వారానికి టామ్ ప్రకటించిన ప్రేక్షకాదరణ సమాచారం ప్రకారం తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో మాటీవీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. టీవీ పరిశ్రమ, యాడ్ ఏజెన్సీలు, అడ్వర్టయిజర్స్ ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) సమాచారానికి భిన్నంగా ట్రాయ్ వివరాలు ఉండటం కొంత వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో మరో విదత ట్రాయ్ భిన్నమైన సమాచారం ఇచ్చింది.

టామ్ సమాచారం ప్రకారం మొదటి స్థానం దక్కించుకున్న మా టీవీకి 587 జిఆర్పీలు లభించగా, రెండో స్థానంలో ఉన్న జీ తెలుగు చానల్ కు 553  జిఅర్పీలు వచ్చాయి. 520 జిఆర్పీలతో జెమిని టీవీ మూడో స్థానంలో ఉండగా 415 జీఆర్పీలతో ఈటీవీ నాలుగో స్థానానికి పరిమితమైంది