• Home »
  • Entertainment »
  • ’బాహుబలి’ తో నెం.1 స్థానం నిలబెట్టుకున్న ‘మా‘

’బాహుబలి’ తో నెం.1 స్థానం నిలబెట్టుకున్న ‘మా‘

మలయాళంలో బాహుబలి టీవీ ప్రసారం చూపిన ప్రభావంతో పోల్చుకున్నపుడు తెలుగులో ఎక్కువగా ఉండవచ్చునని భావించినా అంత ఎక్కువగా మాత్రం లేదు. అయితే, గత వారంతో పోల్చుకున్నప్పుడు 563 జీఆర్పీల నుంచి 715 జీఆర్పీలకు పెరగటం ద్వారా సుస్థిరమైన మొదటి స్థానంలో ఉండగలిగినట్టు మా టీవీ చెప్పుకుంటోంది.

నిజానికి గత వారంతో పోల్చినప్పుడు ఈటీవీ మినహా మిగిలిన మూడు చానల్స్ పెరుగుదల నమోదు చేసుకున్నాయి. ఆ మాటకొస్తే, పెరుగుదల విషయంలో మా టీవీ ( 563 నుంచి 715) కంటే జెమినీ ( 375 నుంచి 550) లోనే ఎక్కువ పెరుగుదల ఉంది. మా టీవీ పెరుగుదల 27 శాతమైతే, జెమినీ పెరుగుదల 47 శాతం ఉంది. జీ తెలుగు (540 నుంచి 578) కు, అంటే 7శాతం పెరిగింది. ఈటీవీ మాత్రమే 10 శాతం ( 447 నుంచి 401కి) తగ్గింది.