• Home »
  • News »
  • జీతం ఇవ్వలేం, మళ్ళీ చెప్పేదాకా పనిచేయండి: ’మీ మరాఠీ’ న్యూస్ చానల్

జీతం ఇవ్వలేం, మళ్ళీ చెప్పేదాకా పనిచేయండి: ’మీ మరాఠీ’ న్యూస్ చానల్

“ యజమాని జైల్లో ఉండటంతో కష్టాల్లో ఉన్నాం. జీతాలు ఇవ్వటంలో ఇప్పటికే రెండు నెలల బకాయిలతో నడుస్తున్నాం. ఇప్పట్లో ఇక జీతాలిచ్చే అవకాశం కనబడటం లేదు. ఈ లోగా జీతాలడక్కుండా పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నాం” ఇదీ మరాఠీ న్యూస్ చనల్ మీ మరాఠీ యాజమాన్యం తరఫున అక్కడి సీనియర్ మేనేజర్లు టీవీ సిబ్బందికి చేసిన విజ్ఞప్తి. చానల్ యజమాని మహేశ్ మోతెవార్ సమృద్ధ జీవన్ సంస్థ చైర్మన్ గా ఒక భారీ  చిట్ ఫండ్ కుంభకోణంలో చిక్కుకొని జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే కొంతమంది ఇతర చానల్స్ లో ఉద్యోగాలు చూసుకొని వెళ్ళిపోగా మిగిలినవాళ్ళు కూడా ఇప్పుడు సంస్థ ప్రకటించినట్టు జీతల్లేకుందా పనిచేయాలని తెలిసిన తరువాత వెళ్ళిపోయే అవకాశముందని సీనియర్ ఉద్యోగులు చెబుతున్నారు. అయితే, చానల్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ మూసేసే ప్రసక్తే లేదని మేనేజింగ్ ఎడిటర్ తులసీదాస్ చెబుతున్నారు. న్యూస్ బులిటెన్స్ ప్రసారం నిలిపివేసి ఇతర కార్యక్రమాలు మాత్రమే ప్రసారం చేస్తున్నమాట  నిజమేనని ఒప్పుకుంటూనే ఇవన్నీ సాంకేతిక కారణాలేనంటున్నారు.